Huzurabad Bypoll:ఈటల ఇలాకాలో హరీష్ హల్ చల్... భారీ ఎత్తున సంబరాలు (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Sep 13, 2021, 03:05 PM ISTUpdated : Sep 13, 2021, 03:41 PM IST
Huzurabad Bypoll:ఈటల ఇలాకాలో హరీష్ హల్ చల్... భారీ ఎత్తున సంబరాలు (వీడియో)

సారాంశం

మాజీ మంత్రి ఈటల రాజేందర్ సొంతగడ్డ కమలాపూర్ లో ఆర్థిక మంత్రి హరీష్ రావు హల్ చల్ చేశారు. భారీ బైక్ ర్యాలీతో హుజురాబాద్ నుండి కమలాపూర్ కు చేరుకున్న ఆర్థిక మంత్రికి ఘన స్వాగతం లభించింది. 

కరీంనగర్: ఇప్పట్లో హుజురాబాద్ ఉపఎన్నిక లేకపోయినా నియోజకవర్గంలో మాత్రం రాజకీయ వేడి తగ్గడంలేదు. అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా విస్త్రుతంగా కార్యక్రమాలను చేపడుతోంది. ఆర్థిక మంత్రి హరీష్ రావు అయితే హుజురాబాద్ లోనే తిష్టవేసి ప్రచార బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ మాజీ మంత్రి, బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ సొంత ప్రాంతం కమలాపూర్ లో హరీష్ హల్ చల్ చేశారు. 

సిద్దిపేట నుండి నేరుగా హుజురాబాద్ పట్టణానికి చేరుకున్న మంత్రి హరీష్ అక్కడినుండి భారీ బైక్ ర్యాలీతో కమలాపూర్ బయలుదేరారు. ఇలా తమ ప్రాంతానికి విచ్చేసిన మంత్రికి కమలాపూర్ టీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. పెద్దఎత్తున టపాసులు కాలుస్తూ మంత్రికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.  

read more  తెలంగాణ విమోచన దినం మీరు నిర్వహిస్తారా.. మేమే పర్మిషన్ తీసుకురావాలా: బండి సంజయ్

ఇదిలావుంటే ఒకప్పుడు మంచి స్నేహితులుగా వున్న ఈటల, హరీష్ మధ్య ఇప్పుడు మాటల యుద్దం సాగుతోంది. మంత్రిమండలి నుండి బర్తరఫ్ అయిన తర్వాత ఈటల టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. ఈ క్రమంలోనే హుజురాబాద్ ఉపఎన్నక అనివార్యం కాగా టీఆర్ఎస్ గెలుపు బాధ్యతను హరీష్ తీసుకున్నారు. దీంతో ఈటల, హరీష్ మధ్య విమర్శ-ప్రతివిమర్శలు, సవాళ్లు-ప్రతిసవాళ్లు కొనసాగుతున్నారు. 

వీడియో

ఈటల రాజేందర్‌కు ఓటమి భయం పట్టుకుందని హరీశ్ దుయ్యబడితే దమ్ముంటే సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ లో ఎవరైనా తనపై పోటీచేసి గెలవాలని ఈటల అంటున్నారు. అలా గెలిస్తే రాజకీయాల నుండే తాను తప్పుకుంటానని సవాల్ విసిరారు. 

ఇక ఓ టీఆర్ఎస్ కార్యకర్త చేతిలో ఓడిపోతున్నానను భయం ఈటల భయపడుతున్నారని హరీశ్ ఎద్దేవా చేశారు. ఎవరు గెలిస్తే మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుందో ఆలోచించి ఓట్లు వేయాలని హరీశ్ రావు ప్రజలకు పిలుపునిస్తున్నారు. కానీ తాను హుజురాబాద్ ను ఎంతో అభివృద్ధి చేశానని... రాబోవు రోజుల్లో కేంద్రం సాయంతో మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని ఈటల అంటున్నారు. ఇలా ప్రస్తుతం హుజురాబాద్ పోరు ఈటల వర్సెస్ గెల్లులా కాకుండా ఈటల వర్సెస్ హరీష్ లా మారింది. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు