నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలకలం.. 11.14 క్వింటాళ్లు స్వాధీనం.. అందులో ఏం కలిపారంటే?

By Mahesh K  |  First Published Jan 11, 2024, 2:16 AM IST

వికారాబాద్ పోలీసులు నకిలీ అల్లం వెల్లుల్లిని తయారు చేసి విక్రయిస్తున్న కల్తీరాయుళ్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 11.14 క్వింటాళ్ల నకిలీ అల్లం వెల్లల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
 


వికారాబాద్ పోలీసులు కల్తీరాయుళ్ల ఆటకట్టు చేశారు. నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మార్కెట్ తరలిస్తున్న కల్తీరాయుళ్లను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టు చేసి ఆరా తీయగా.. వెల్లుల్లి పొట్టు, ఇతర కెమికల్స్‌తో ఈ నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్టు గుర్తించారు. 11.14 క్వింటాళ్ల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

 వికారాబాద్ టాస్క్ ఫోర్స్ అధికారులు స్టేషన్ జిల్లా కేంద్రంలో తనిఖీలు నిర్వహిస్తుండగా అక్కడి నుంచి వెళ్లుతున్న ఓ ట్రాలీ ఆటోను ఆపారు. అందులో హైఫైవ్, టేస్టీ కింగ్ టైగర్ పేర్లతో అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బాలు ఉన్నాయి. వాటి గురించి ఆరా తీయగా.. ఐదు కిలోల పేస్ట్‌ను రూ. 200కే విక్రయిస్తున్నట్టు చెప్పడంతో అనుమానం వచ్చింది. రాజేంద్రనగర్‌కు చెందిన మన్షఖ్ అనే వ్యక్తి.. అత్తాపూర్‌లోని హ్యాపీ హోమ్స్ టవర్స్‌లో నివాసం ఉండే అజిత్ చరణ్య నుంచి కల్తీ అల్లం, వెల్లుల్లి కొనుగోలు చేసి విక్రయిస్తుంటానని వివరించాడు. దీంతో పోలీసులు చరణ్యను వికారాబాద్ పోలీసు స్టేషణ్‌కు రమ్మని విచారించారు. అల్లు వెల్లుల్లిని పేస్ట్ కోసం ఉపయోగించకుండా.. కేవంల వెల్లుల్లి పొట్టును, దానితోపాటు యాసిడ్స్, కెమికల్స్ ఆజన్ టాక్స్ టైటానయం డై ఆక్సైడ్, గ్జాంథన్ గమ్‌లతో ఈ వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్టు తేలింది.

Latest Videos

Also Read : TSRTC: సంక్రాంతికి ఏపీకి బస్సుల సంఖ్య తగ్గించిన ఆర్టీసీ.. కారణాన్ని వెల్లడించిన సజ్జనార్

దీంతో అజిత్ చరణ్య నివాసానికి వెళ్లి తనిఖీలు చేసి.. మొత్తం 11.14 క్వింటాళ్ల కల్తీ వెల్లుల్లి పేస్ట్, కెమికల్స్, యాసిడ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మనుష్క్, అజిత్ చరణ్యలపై కేసులు నమోదు చేశారు. ఆటోను సీజ్ చేశారు. ఆ తర్వాత తక్కువ ధరకు వస్తున్నాయని కొనుగోలు చేయకుండా.. నకిలీవా? అసలువా? అని పరిశీలించి కొనుగోళ్లు చేయాలని పోలీసులు ప్రజలకు సూచించారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ నకిలీ కలకలం రేపడంతో ప్రజలు అప్రమత్తం అవుతున్నారు.

click me!