టీడీపీతో పొత్తు వుంటుందా , లేదా .. బీజేపీ సమావేశంలో విజయశాంతి వ్యాఖ్యలు , బండి సంజయ్ క్లారిటీ

By Siva KodatiFirst Published Dec 30, 2022, 8:38 PM IST
Highlights

బీజేపీ తెలంగాణ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీతో పొత్తు వుంటుందా లేదా అన్నదానిపై క్లారిటీ ఇవ్వాలని కోరారు. దీనికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. 
 

బీజేపీ సమావేశంలో టీడీపీతో పొత్తుపై హాట్ హాట్‌గా చర్చ నడుస్తోంది. టీడీపీతో పొత్తుపై స్పష్టత ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరారు మాజీ ఎంపీ విజయశాంతి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ పొత్తుతో హస్తం పార్టీ నష్టపోయిందని ఆమె గుర్తుచేశారు. అటు విజయశాంతి కోరిన విధంగా టీడీపీతో పొత్తుపై స్పష్టత ఇవ్వాలని ఎంపీ అర్వింద్ కూడా కోరారు. దీనిపై స్పందించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. తెలంగాణలో టీడీపీతో పొత్తు వుండదని స్పష్టం చేశారు. కార్యకర్తలతో ఈ విషయం చెప్పాలని సూచించారు. ఇటీవల ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది టీటీడీపీ. త్వరలోనే నిజామాబాద్, వరంగల్‌లలో టీడీపీ బహిరంగ సభలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సంజయ్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

ఇకపోతే... ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసుల నేపథ్యంలో విజయశాంతి స్పందించిన సంగతి తెలిసిందే. ఎనిమిదేళ్లుగా చేసిన పాపాలు పండుతున్నాయని అన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ కానీ వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తారు. వాళ్లపని వాళ్లను చేయనివ్వాలి.. హంగామా చేయడం ఎందుకు అన్నారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే సరిపోతుంది. వాళ్లకు డౌట్ వస్తే వాళ్లు తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటారు. ఇక తెలంగాణకు వచ్చేసరికి.. ఇక్కడ అవినీతి భయంకరంగా జరుగుతున్నాయని మేము చాలా రోజులుగా చెబుతున్నాం. ఇప్పుడు దేవుడు కనికరించాడు. మా గోడు దేవుడు విన్నాడు. ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని తీసుకువచ్చాం. తెలంగాణ ప్రజలకు న్యాయం జరగడం లేదు. ఒక కుటుంబానికి మాత్రమే న్యాయం జరుగుతోంది. ఈడీ రైడ్స్ కు మీరు ఎక్కువ హంగామా చేస్తున్నారంటే మీదే ఏదో తప్పు ఉందన్నట్టు అన్నారు.

ALso REad: కవిత ఒక్క దాని మీదనే కాదు..టీఆర్ఎస్ నేతలందరి మీదా దాడులు జరగాలి.. విజయశాంతి

ఒకరిద్దరి మీదనే కాదు యావత్ తెలంగాణ టీఆర్ఎస్ నాయకులందరిమీద దాడులు జరగాలి. వాళ్లు ఎంత దోచుకున్నారో ప్రజలకు తెలియాలి. తెలంగాణ ముసుగుతో ఎలా దోచుకుంటున్నారో ప్రజలు తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి దగ్గరినుంచి అందరూ అదేపని.. దీనిమీద ప్రజలకు తెలియాలి. మోడీ రావడానికి ఆయనకేం వేరే పనిలేదా..అంటూ ప్రశ్నించారు. తెలంగాణలోని ఈ రాజకీయ పరిణామాల మీద.. కేసీఆర్ నెక్ట్స్ వ్యూహం ఏంటో, రాబోయే ఎన్నికల కోసం కేసీఆర్ ఇంకోసారి మోసం ఎలా చేయబోతున్నాడో ఓ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను అని చెప్పుకొచ్చారు. ఉద్యమనాయకురాలిగా మాట్లాడడం నా బాధ్యత అని అన్నారు. బీజేపీ చేయిస్తుందన్న దానిమీద స్పందిస్తూ.. బీజేపీకి ఏం పనీ పాటా లేదా అంటూ కేసీఆర్ వ్యాఖ్యలను విమర్శించారు. బుర్ర ఉండి మాట్లాడుతున్నారో, బుర్ర లేకుండా మాట్లాడుతున్నారో వారికే తెలియాలి అంటూ కేసీఆర్, కవిత.. టీఆర్ఎస్ నేతలకు చురకలు వేశారు. 

click me!