కేసీఆర్‌ను విమర్శిస్తున్నాం, మనమేం చేస్తున్నాం: విజయశాంతి విసుర్లు

Published : Nov 20, 2018, 12:29 PM IST
కేసీఆర్‌ను విమర్శిస్తున్నాం, మనమేం చేస్తున్నాం: విజయశాంతి విసుర్లు

సారాంశం

ఈ నెల 23వ తేదీన మేడ్చల్‌లో నిర్వహించే సోనియాగాంధీ సభలో  కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్క మహిళా నేత ఫోటో కూడ పెట్టకపోవడంపై  కాంగ్రెస్ పార్టీ నేత సోనియాగాంధీ విమర్శలు గుప్పించారు.

హైదరాబాద్: ఈ నెల 23వ తేదీన మేడ్చల్‌లో నిర్వహించే సోనియాగాంధీ సభలో  కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్క మహిళా నేత ఫోటో కూడ పెట్టకపోవడంపై  కాంగ్రెస్ పార్టీ నేత సోనియాగాంధీ విమర్శలు గుప్పించారు.

ఈ నెల 23వ తేదీన మేడ్చల్‌లో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ, మాజీ చీఫ్ సోనియాగాంధీలతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభను ఏర్పాటు చేసింది.ఈ సభలో  వీలైతే ప్రజా కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను వేదికపై నుండి  పరిచయం చేయించాలని భావిస్తున్నారు.

ఈ సభ ఏర్పాట్లకు సంబంధించి ఫోటోలు, ఫ్లెక్సీల తయారీలో ఒక్క మహిళ నేతకు కూడ స్థానం దక్కలేదు. దీంతో విజయశాంతి  మంగళవారం నాడు ఈ కామెంట్స్ చేశారు.  టీఆర్ఎస్ ప్రభుత్వంలో  ఒక్క మహిళకు కూడ మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శలు చేస్తున్నాం..  కానీ, కాంగ్రెస్ పార్టీ లో కూడ అదే తరహ వివక్ష కొనసాగుతోందన్నారు.

సోనియా గాంధీ సభలో మహిళలు పాల్గొనరా అని ఆమె ప్రశ్నించారు. ఈ సభలో మగవాళ్ళు మాత్రమే పాల్గొంటారని  ఆని ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోనియా గాంధీ సభకు సంబంధించి  కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళ నేతల ఫోటోలు ప్రచురించకపోవడం పై  ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

కాంగ్రెస్, టీడీపీ పొత్తు: విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

 

అన్న కేసీఆర్ వేరు, సీఎం కేసీఆర్ వేరే: విజయశాంతి

కత్తి దూసిన జానా: రాములమ్మ, జేజమ్మల విన్యాసాలు

ఎందుకో చెప్పాల్సిందే: కేసీఆర్‌కు విజయశాంతి సవాల్

చిరంజీవి, పవన్ లపై విజయశాంతి సంచలన కామెంట్స్

పవన్ డిఫరెంట్, ఇప్పుడే ఏం చెప్పలేం: విజయశాంతి

చిరుతో సై, శశికళను అందుకే కలిశా: విజయశాంతి

అందుకే పిల్లలు వద్దనుకొన్నాం: విజయశాంతి

 

 

PREV
click me!

Recommended Stories

Richest District : ఇండియాలో రిచెస్ట్ జిల్లా ఏదో తెలుసా? ముంబై, ఢిల్లీ కానే కాదు !
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు.. హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో జల్లులు