దొరల రాజ్యం పోవాలంటే మళ్లీ నక్సలిజం రావాలి

Published : Jul 04, 2017, 02:04 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
దొరల రాజ్యం పోవాలంటే మళ్లీ నక్సలిజం రావాలి

సారాంశం

తెలంగాణలో దొరల రాజ్యం నడుస్తున్నది. ఇక్కడ దొరల రాజ్యం పోవాలంటే మళ్లీ నక్సలిజం రావాలి. బంగారు తెలంగాణ కాదు బిచ్చమెత్తుకునే తెలంగాణ చేసిండు. ఒక ఆడపడుచు ఫోన్ చేస్తే మాట్లాడవా? తాత ముత్తాతల కాలం నుంచి నీకేమన్నా కోవింద్ పరిచయమా?

ముక్కుసూటిగా మాట్లాడే వి.హన్మంతరావు మరోసారి పంచ్ డైలాగ్ లు పేల్చేశాడు. సిఎం కెసిఆర్ పై ఘాటైన విమర్శలు చేశారు. సూటిగా సుత్తిలేకుండా మొహమాటం అసలే లేకుండా కడుపులో ఉన్నది కక్కేశాడు. ఊరూరా తిరిగి జనాలను ఏకం చేసి కెసిఆర్ ను గద్దె దించుతానని హెచ్చరించారు. మాజీ స్పీకర్ మీరా కుమార్ ఫోన్ చేస్తే కెసిఆర్ మాట్లాడకపోవడాన్ని తప్పుపట్టారు. కోవింద్ తనకు తాత ముత్తాతల కాలం నుంచి పరిచయమున్నట్లు ఊరి నిండా ఫ్లెక్సీలు పెట్టడమేంటని ప్రశ్నించారు.

తెలంగాణలో దొరల రాజ్యం పోవాలంటే మళ్లీ నక్సలిజం రావాలంటూ ఆయన మనసులో ఉన్నమాట బయటపెట్టేశాడు. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే కెసిఆర్ తెలంగాణలో దొరల రాజ్యం తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇక కోవింద్ కు కెసిఆర్ మద్దతివ్వడం, ఘన స్వాగతం పలకడం పట్ల వి.హెచ్ తోపాటు కాంగ్రెస్ నేతలు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. సర్వే సత్యనారాయణ, పొన్నం ప్రభాకర్ లాంటి నేతలంతా కెసిఆర్ పై విమర్శల వర్షం కురిపించారు.

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం