భూపాలపల్లి పోలీసులు ఏం చేశారో తెలుసా?

Published : Jul 04, 2017, 01:01 PM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
భూపాలపల్లి పోలీసులు ఏం చేశారో తెలుసా?

సారాంశం

జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లాలో పోలీసులు భలే పనిచేశారు. భూపాలపల్లి పట్టణ కేంద్రంలో తమ సత్తా చాటారు. చిల్లర పనులు చేస్తున్న వారిని కటకటాల వెనకకు పంపించారు. ఇంతకూ వారు చేసిన పనేంటని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి.

భూపాలపల్లి పట్టణంలోని పలు కిరాణం షాపులు పాన్ షాపులు బెల్టు షాపుల పై పోలీసులు కన్నెర్రజేశారు. ఎస్సై వెంకట్రావు ఆద్వర్యంలో ఆయా షాపులపై దాడులు చేశారు. కిరాణం దుకాణాల మాటున మద్యం బాటిల్లు , గుట్కా, జర్దా అమ్మకాలు గుట్టుగా సాగిస్తున్న వారి పని పట్టారు. మద్యం, గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని విక్రయిస్తున్న అరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

గుడి, బడి, కాలేజీ పరిసర ప్రాంతాల్లో బెల్టు షాపులు నిర్వహిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎస్సై వెంకట్రావు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే