బీఆర్ఎస్ మొండిచేయి: అనుచరులతో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వీరేశం భేటీ

By narsimha lode  |  First Published Aug 23, 2023, 2:57 PM IST

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే  వేముల వీరేశంత తన అనుచరులతో ఇవాళ సమావేశమయ్యారు.  బీఆర్ఎస్ టిక్కెట్టు  దక్కకపోవడంతో భవిష్యత్తు కార్యాచరణపై  ఆయన  అనుచరులతో సమావేశమయ్యారు.



నల్గొండ: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే  వేముల వీరేశం బుధవారంనాడు  తన అనుచరులతో నకిరేకల్ లో సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచారణను సిద్దం  చేసుకుంటున్నారు.  2014 ఎన్నికల్లో నకిరేకల్ నుండి వేముల వీరేశం బీఆర్ఎస్ అభ్యర్ధిగా  విజయం సాధించారు.  2018 ఎన్నికల్లో వేముల వీరేశం అదే స్థానం నుండి పోటీ చేసి  ఓటమి పాలయ్యాడు.ఈ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా  పోటీ చేసిన  చిరుమర్తి  లింగయ్య విజయం సాధించాడు

.  ఆ తర్వాత పరిణామాల్లో  చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ లో చేరారు. చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ లో చేరడాన్ని వేముల వీరేశం అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ, అయినా  లింగయ్య  ను  పార్టీ చేర్చుకుంది.  నియోజకవర్గంలో  చిరుమర్తి లింగయ్య, వేముల వీరేశం మధ్య  గత కొంత కాలంగా  ఘర్షణలు చోటు చేసుకున్నాయి . జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డితో  కూడ  వేముల వీరేశానికి మధ్య  సంబంధాలు కూడ  అంతంత మాత్రంగానే ఉన్నాయనే  ప్రచారం కూడ సాగుతుంది.

Latest Videos

undefined

అయితే  నకిరేకల్ టిక్కెట్టు కోసం  వేముల వీరేశం ప్రయత్నాలు సాగించారు. యితే నకిరేకల్ నుండి  సిట్టింగ్ ఎమ్మెల్యే  చిరుమర్తి లింగయ్యకే  బీఆర్ఎస్ నాయకత్వం టిక్కెట్టును కేటాయించింది.  దీంతో  తీవ్ర అసంతృప్తితో ఉన్న వేముల వీరేశం  ఇవాళ తన అనుచరులతో సమావేశమయ్యారు.  వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్నారు. అయితే వీరేశం కాంగ్రెస్ లో చేరికను  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ప్రచారం సాగుతుంది.దీంతో  వేముల వీరేశం  కాంగ్రెస్ లో చేరికకు అప్పట్లో బ్రేక్ పడింది.

అయితే  ఇవాళ సమావేశంలో  వీరేశం  ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే  రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.  కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన  సర్వేల్లో వీరేశానికి అనుకూలంగా ఫలితాలు వచ్చినట్టుగా ప్రచారం సాగుతుంది.దీంతో వీరేశానికి కాంగ్రెస్ పార్టీలో చేరికకు  గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందంటూ  చర్చ సాగుతుంది. అయితే  ఈ ప్రచాారంలో వాస్తవం ఎంతనేది  తేలాల్సి ఉంది. 
 

click me!