భర్తనొదిలేసి అమెరికా నుంచి వచ్చి ఏం చేసిందటే ?

Published : Jul 11, 2017, 08:32 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
భర్తనొదిలేసి అమెరికా నుంచి వచ్చి ఏం చేసిందటే ?

సారాంశం

ఆమె ఒక మాయా లేడీ. అమెరికాలో భర్తనొదిలేసింది. హైదరాబాద్ నగరంలో కాలు పెట్టింది. ఇక ఇక్కడకి వచ్చిన ఆమె చేసిన లీలలు అన్నీ ఇన్నీ కావు. ఆమె లీలలపై పోలీసులు పక్కా ఆధారాలు సేకరించి కటకటాల వెనుకకు నెట్టేశారు. ఇంతకూ ఆమె చేసిన రకరకాల లీలల గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.

ఉషశ్రీ అనే 33 ఏళ్ల మహిళ భర్తతో విడాకులు తీసుకొని 2010లో అమెరికా నుంచి హైదరరాబాద్ నగరానికి వచ్చింది. ఇక్కడే స్థిరపడిపోయింది. ఇక్కడ శ్రీకాంత్‌రెడ్డి అనే స్థిరాస్తి వ్యాపారితో పరిచయం పెంచుకుంది. అతని కార్యాలయంలోనే పనిచేస్తూ చివరకు అతనితో గత కొంతకాలంగా సహజీవనం చేస్తోంది. వీరిద్దరూ కలిసి డబ్బు సంపాదన కోసం గత ఏప్రిల్‌ నెలలో యోగా కేంద్రాన్ని ప్రారంభించారు. ఆ యోగా కేంద్రం ద్వారా అమాయకులను బుట్టలో వేసుకుని డబ్బులు గుంజే పని షురూ చేశారు. ఉషశ్రీ లీలలపై సోమవారం సాయంత్రం మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ రమణకుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ కళింగరావు వివరాలు వెల్లడించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.

 

కొండాపూర్‌లో ఉండే గంటి జగదీశ్‌, అతని భార్య కిరణ్మయి కొంత కాలంగా మనోవేదనతో బాధపడుతున్నారు. గత నెల 27న ఖానామెట్‌లో ఉన్న షూర్‌ యోగా కేంద్రానికి వెళ్లి నిర్వాహకురాలు నమ్మి ఉషశ్రీ(33)కి తమ సమస్యను చెప్పుకున్నారు. దీంతో ఆమె వారికి కాయకల్ప ప్రక్రియ నేర్పిస్తానని, దాన్ని సాధన చేస్తే మానసిక సమస్యలు ఉండవని నమ్మించింది. మూడు రోజుల పాటు స్పిరిచ్యువల్‌ కౌన్సిలింగ్‌ పేరుతో హిప్నాటిజం చేసి సదరు మహిళ కుటుంబ వివరాలు, వ్యక్తిగత సమస్యలను ఉషశ్రీ తెలుసుకుంది. కౌన్సిలింగ్‌ పూర్తి కాలేదని చెప్పి జులై ఒకటిన యోగా కేంద్రంలో ఉండమంది. మరుసటి రోజు ఉదయం జగదీశ్‌, కిరణ్మయిని నానక్‌రాంగూడ సమీపంలోని కాళీమాత గుడి వద్దకు తీసుకెళ్లి దయ్యం పట్టిందని చెప్పి క్షుద్ర పూజలు చేయించింది.

 

అనంతరం కేంద్రానికి వచ్చిన తర్వాత కిరణ్మయిని వివస్త్రరాలిని చేసి తన సోదరుడు అభిషేక్‌(29)తో బెల్ట్‌, రుద్రాక్ష మాలలతో కొట్టించింది. ఆమె నగ్నంగా ఉన్న చిత్రాలను తీసుకుంది సెల్ ఫోన్ లో రికార్డు చేసుకుంది ఉష శ్రీ. పలు రకాల పళ్ల రసాలను తాగించి భార్యభర్తలిద్దర్నీ తన బానిసలుగా మార్చుకుంది. అదే రోజు సాయంత్రం శ్రీశైలం వెళ్దామని అక్కడ మరిన్ని పూజలు చేయాల్సి ఉంటుందని చెప్పింది. ఉషశ్రీతోపాటు ఆమెతో సహజీనం చేస్తున్న శ్రీకాంత్‌రెడ్డి, తన సోదరుడు అభిషేక్‌తో కలిసి బెంగళూరు మీదుగా భార్యాభర్తలిద్దరినీ శ్రీరంగం తీసుకెళ్లారు. అక్కడి నుంచి అరుణాచలం వెళ్లారు. అక్కడ వారి వద్ద నగలు లాక్కుని బ్యాంకు అకౌంట్‌ రూ.2 లక్షలు ఆన్‌లైన్‌లో ఉషశ్రీ తన ఖాతాలోకి బదిలీ చేయించుకుంది.

 

శ్రీశైలం వెళ్తామని చెప్పిన దంపతులకు వారి కుటుంబ సభ్యులు ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో ఈనెల 3వ తేదీన వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి వారి ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా తిరువణ్ణామలై ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. మాదాపూర్‌ పోలీసలు తమిళనాడు పోలీసుల సహకారంతో నిందితులను పట్టుకుని ఈ నెల 9న మాదాపూర్ పోలీసు స్టేషన్‌కు తీసుకవచ్చారు. అనంతరం ఉషశ్రీని, ఆమె సోదరుడు అభిషేక్ పై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

 

అయితే ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే... తన భర్తను ఉషశ్రీ లోబర్చుకొని డబ్బులు కాజేసిందని శ్రీకాంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని కూడా పోలీసులు వెల్లడించారు. . న యోగా కేంద్రం నిర్వహకురాలు, ఆమెకు సహకరిస్తున్న మరో వ్యక్తిని మాదాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు.

 

మొత్తానికి భర్తకు విడాకులిచ్చి అమెరికా నుంచి వచ్చిన కిలేడీ అలా కటకటాలపాలైంది.

PREV
click me!

Recommended Stories

Jabardasth Anchor Rashmi Gowtham Pressmeet: మీ సంస్కృతి అంతా మా బట్టలపైనే ఉంది| Asianet News Telugu
Harish Rao Comments on Revanth Reddy:టెండర్లురద్దు చేసి సిబిఐవిచారణ జరిపించాలి | Asianet News Telugu