వరంగల్ లో దారుణం: ఇంట్లోకి చొరబడి నజీర్ అనే వ్యక్తి హత్య

Published : Aug 30, 2023, 09:31 AM ISTUpdated : Aug 30, 2023, 09:40 AM IST
వరంగల్ లో దారుణం: ఇంట్లోకి చొరబడి  నజీర్ అనే వ్యక్తి హత్య

సారాంశం

వరంగల్ పట్టణంలోని శివనగర్ లో రౌడీషీటర్ నజీర్ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వరంగల్: పట్టణంలోని శివనగర్ లో   నజీర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు బుధవారంనాడు తెల్లవారుజామున  హత్య చేశారు. ఇంట్లోకి చొరబడి నజీర్ ను హత్య చేశారు దుండగులు. మృతదేహన్ని  పోస్టుమార్టం కోసం  ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

నజీర్  రైల్వేలో క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. నజీర్ ను ఎవరు హత్య చేశారు, ఎందుకు  హత్య చేశారనే విషయాలపై  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు  పోలీసులకు  ఫిర్యాదు చేశారు.  ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు మోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. వరంగల్ పట్టణంలో  ఈ తరహా ఘటనలు  ఎక్కువగా  చోటు చేసుకోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?