ఎన్నికల ముందు కాంగ్రెస్, బీజేపీలు తప్పుడు వాగ్దానాలు చేస్తున్నాయి: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత

By Mahesh Rajamoni  |  First Published Aug 30, 2023, 3:57 AM IST

MLC Kavitha: ఎన్నికలకు ముందు కాంగ్రెస్, బీజేపీలు తప్పుడు హామీలు ఇస్తున్నాయ‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ కవిత అన్నారు. ప్ర‌తిప‌క్షాల వ్యాఖ్య‌ల‌ను తిప్పికొడుతూ, దళితుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అనీ, 2014లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేసిందన్నారు.
 


Telangana Assembly Elections 2023: ఎన్నికలకు ముందు కాంగ్రెస్, బీజేపీలు తప్పుడు హామీలు ఇస్తున్నాయ‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ కవిత అన్నారు. ప్ర‌తిప‌క్షాల వ్యాఖ్య‌ల‌ను తిప్పికొడుతూ, దళితుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అనీ, 2014లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేసిందన్నారు.

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత నిప్పులు చెరిగారు. దక్షిణాది రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా పార్టీల నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్, బీజేపీల‌ను టార్గెట్ చేస్తూ ఎమ్మెల్సీ క‌విత తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. "రాష్ట్రంలో రెండు పెద్ద పార్టీల బహిరంగ సభలు జరిగాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ దళితులపై కొత్త ప్రేమను చూపించి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభను నిర్వహించింది. తాజాగా బీజేపీ తన జాతీయ నేతలతో రైతు భరోసా సమావేశం ఏర్పాటు చేసింది. ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలు తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఇవి రుజువు చేస్తున్నాయ‌ని" అన్నారు.

Latest Videos

దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ దళితుల్లో పేదరిక నిర్మూలనకు కృషి చేయలేదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నారనీ, దళితులు, పేదలు, వెనుకబడిన తరగతులు, మైనార్టీల కోసం అనేక పథకాలు తీసుకొచ్చారన్నారు. కాంగ్రెస్ నేతలు హామీలు ఇస్తే ప్రజలు నమ్మరని భావించిన కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గేను సమావేశానికి రప్పించింది. "మేము ఇప్పటికే ఏమి చేస్తున్నామో వారు ప్రకటించారు. ఇప్పటికే దళిత బంధు కింద రూ.10 లక్షలు ఇస్తున్నామని, రూ.12 లక్షలు ఇస్తామని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే రూ.2000వేల పింఛన్లు ఇస్తున్నామని, రూ.4000వేలు ఇస్తామని ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ కు దళితులు, పేదలపై ప్రేమ లేదు.. రాజ‌కీయాలు మాత్ర‌మే చేస్తోంద‌ని విమ‌ర్శించారు.

దళితుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అనీ, 2014లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేసిందన్నారు. మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ చీఫ్ గా చేయడమే కాంగ్రెస్ చేసిందన్నారు. దళితులకు చేసిందేమీ లేదన్నారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. "మూడు వ్యవసాయ చట్టాలను తీసుకురావడం ద్వారా 850 మంది రైతుల మరణాలకు బీజేపీయే కారణమని.. మన రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టి కేంద్రంలో అదే తరహా పథకాన్ని అమలు చేశారని" ఆరోపించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీఆర్ఎస్ ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ప్రకటించిందని, కానీ కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థులను ప్రకటించే పరిస్థితిలో లేవన్నారు. వారికి సీఎం అభ్యర్థి లేరు. మా సీఎం అభ్యర్థి కేసీఆర్. వారు తమ సీఎం అభ్యర్థిని ప్రకటించాలి. వారు అయోమయంలో, నిరాశలో ఉన్నారని, అందువల్ల ఈ సమావేశాలను నిర్వహించి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.

click me!