బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు..

By Mahesh Rajamoni  |  First Published Aug 30, 2023, 1:58 AM IST

Nagarkurnool: హింసాత్మక-వివాదాస్పద ప్రసంగం నేప‌థ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియో లింక్ ను కూడా కాంగ్రెస్ సాక్ష్యంగా సమర్పించింది. నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లిలోని బొప్పలిలో ఆగస్టు 27న ఈ ఘటన చోటుచేసుకుంది.
 


BRS MLA violent speech: హింసాత్మక-వివాదాస్పద ప్రసంగం నేప‌థ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియో లింక్ ను కూడా కాంగ్రెస్ సాక్ష్యంగా సమర్పించింది. నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లిలోని బొప్పలిలో ఆగస్టు 27న ఈ ఘటన చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకెళ్తే.. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆయ‌న వివాదాస్ప‌ద ప్రసంగానికి సంబంధించిన వీడియో లింక్ ను కూడా కాంగ్రెస్ సాక్ష్యంగా సమర్పించింది. నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లిలోని బొప్పలిలో ఆగస్టు 27న ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వీడియోలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అసభ్య పదజాలంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తుపాకీతో కాల్చుతానంటూ బెదిరించడం కనిపించింది.

Latest Videos

undefined

"నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థి అయిన ఆ పార్టీ  ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం. తనకు, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలను కాల్చి చంపుతామని హెచ్చరించారు. అంతేకాదు, కావాలంటే వారి చేతులను తొలగిస్తానని చెప్పారు. తన అనుచరులను ఆదేశిస్తే ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఆ ప్రాంతంలో తిరగడానికి వీల్లేదంటూ" వ్యాఖ్యానించార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారనీ, రాజకీయ ప్రత్యర్థులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర పోలీసులను దుర్వినియోగం చేస్తూ తన భర్తపై హింస, వేధింపులకు పాల్పడుతున్నారంటూ రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డిపై మానవ హక్కుల కమిషన్ లో సూర్యాపేట బీఆర్ఎస్ కౌన్సిలర్ రేణుక దాఖలు చేసిన పిటిషన్ ను కూడా ప్రస్తావించింది. మీడియా క‌థ‌నాల ప్ర‌కారం సూర్యాపేట జిల్లా మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్ ను మంత్రి వేధిస్తున్నారని రేణుక తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తాను 20 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాననీ, మంత్రి జగదీశ్ రెడ్డి అనుచరుడైన తన భర్త ఎమ్మెల్యే టికెట్ అడిగినందుకే మంత్రి ఇలా వ్యవహరిస్తున్నారని రేణుక ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎమ్మెల్యేకు సీటు కేటాయించాలని డిమాండ్ చేసినందుకు ఒకే రోజులో 71 కేసులు నమోదయ్యాయని ఆరోపించారు.

click me!