సింగరేణి ఎన్నికలు.. యాజమాన్యం సహకరించడం లేదు : హైకోర్టులో కేంద్ర కార్మిక శాఖ పిటిషన్

Siva Kodati | Published : Oct 7, 2023 7:15 PM

సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలకు సంబంధించి కేంద్ర కార్మిక శాఖ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది . ఎన్నికలకు  సింగరేణి యాజమాన్యం సహకరించడం లేదని .. తుది ఓటరు జాబితాను కూడా ప్రకటించలేదని డిప్యూటీ చీఫ్ లేబర్ కమీషనర్ డీ.శ్రీనివాసులు తన మధ్యంతర పిటిషన్‌లో తెలిపారు.  

Google News Follow Us

సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలకు సంబంధించి కేంద్ర కార్మిక శాఖ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికలకు  సింగరేణి యాజమాన్యం సహకరించడం లేదని పిటిషన్‌లో పేర్కొంది. గత నెల 27న సమావేశం ఏర్పాటు చేస్తే సింగరేణి యాజమాన్యం తరపున ఎవ్వరూ హాజరుకాలేదని.. డిప్యూటీ చీఫ్ లేబర్ కమీషనర్ డీ.శ్రీనివాసులు తన మధ్యంతర పిటిషన్‌లో తెలిపారు.

తుది ఓటరు జాబితాను కూడా ప్రకటించలేదు.. దీంతో కోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్ 28న ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్ ప్రకటించామని కేంద్రం పేర్కొంది. సింగరేణి యాజమాన్యం తీరు కారణంగా ఎన్నికల నిర్వహణలో ముందుకు వెళ్లలేకపోతున్నామని పిటిషన్‌లో వెల్లడించింది. దీనిపై తగిన విధంగా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కేంద్ర కార్మిక శాఖ కోరింది. 

ALso Read: Singareni Elections: ఎట్టకేలకు మోగిన సింగరేణి ఎన్నికల నగారా.. పోలింగ్‌ ఎప్పుడంటే..?

కాగా.. నామినేషన్ ప్రక్రియ అక్టోబర్‌ 6, 7 తేదీల్లో జరగగా.. నామినేషన్లను ఉపసంహరణకు అక్టోబర్ 9, 10 తేదీల్లో అవకాశం కల్పించారు. అనంతరం నామినేషన్ల పరిశీలన జరుగనున్నది. ఆ తరువాత సింబల్స్ కేటాయింపు జరుగనున్నది. ఇక అక్టోబర్ 28న పోలింగ్‌ జరుగనున్నది. అదే రోజు కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తారు. 

వాస్తవానికి మే 22న సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర కార్మిక సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. వివిధ కారణాలను చూపుతూ.. అప్పట్లో ఎన్నికలు వాయిదా వేశారు. ఈ తరుణంలో సింగరేణి యాజమాన్యం అభ్యర్థనను కూడా హైకోర్టు తిరస్కరించింది. అక్టోబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో హడావుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది.