Hyderabad: పోక్సో చట్టం కింద ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఓ వ్యక్తికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే, దోషికి రూ.50,000 జరిమానా కూడా విధించింది. పోక్సో చట్టం లైంగిక వేధింపులు, అత్యాచారం, అశ్లీల చిత్రాల నేరాల నుండి పిల్లలకు రక్షణ కల్పిస్తుంది. సంబంధిత కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తుంది.
Man handed 20 yr jail term for raping minor girl: పోక్సో చట్టం కింద ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఓ వ్యక్తికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే, దోషికి రూ.50,000 జరిమానా కూడా విధించింది. పోక్సో చట్టం లైంగిక వేధింపులు, అత్యాచారం, అశ్లీల చిత్రాల నేరాల నుండి పిల్లలకు రక్షణ కల్పిస్తుంది. సంబంధిత కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తుంది.
వివరాల్లోకెళ్తే.. 2020లో ఒక మైనర్ బాలికపై ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసుకు సంబంధించి తాజాగా న్యాయస్థానం తీర్పును వెల్లడిస్తూ.. దోషికి 20 ఏండ్ల జైలు శిక్షను విధించింది. అలాగే, 50 వేల రూపాయల జరిమానా విధించింది. వికారాబాద్ జిల్లాకు చెందిన మహిపాల్ రెడ్డికి మేడ్చల్ లోని పోక్సో చట్టం ప్రత్యేక కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిందని సంబంధిత అధికారులు తెలిపారు. లైంగిక వేధింపులు, లైంగికదాడులు, అశ్లీల చిత్రాల నుంచి పిల్లలను రక్షించడంతో పాటు విచారణ కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసేందుకు పోక్సో చట్టం దోహదపడుతుంది.
undefined
2020లో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి రూ.50 వేల జరిమానా కూడా విధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిపాల్ రెడ్డి తన సోదరి ఇంటికి వెళ్లగా వీధిలో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న బాలికను చూశాడు. తల్లిదండ్రులు ఇంట్లో లేరని తెలుసుకున్న అతడు బాలికకు చాక్లెట్లు ఇస్తానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
అంతలోనే ఆమె తల్లిదండ్రులు తిరిగి వచ్చి చూడగా ఆమె కనిపించలేదు. వెంటనే ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. మహిపాల్ రెడ్డి బాలికపై లైంగిక దాడి చేశాడని తెలుసుకుని షాక్ కు గురైన వారు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేసి, విచారణ చేపట్టారు.