ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ హైదరాబాద్ సనత్‌నగర్ జెక్ కాలనీలో టీడీపీ శ్రేణులు నిర్వహిస్తున్న ‘‘బాబుతో నేను ’’ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ మద్ధతు తెలిపారు.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు ప్రాంతాల్లో టీడీపీ మద్ధతుదారులు నిరసనలు, ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఏకంగా ఐటీ ఉద్యోగులు రోడ్డెక్కారు. అలాగే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరసన చేస్తున్నారు. వీటికి బీఆర్ఎస్ నేతలు కూడా హాజరై సంఘీభావం తెలుపుతున్నారు. తాజాగా హైదరాబాద్ సనత్‌నగర్ జెక్ కాలనీలో టీడీపీ శ్రేణులు నిర్వహిస్తున్న ‘‘బాబుతో నేను ’’ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ మద్ధతు తెలిపారు. దీక్షా శిబిరానికి వచ్చిన ఆయన తెలుగుదేశం పార్టీ నేతలను పలకరించి, సంఘీభావం తెలియజేశారు. తలసాని రాకతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు కోలాహలం నెలకొంది.
కాగా.. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ బాధకరమని తలసాని పేర్కొన్నారు. ఈ మేరకు తలసాని ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంత్రిగా పని చేశాను.. వారి అరెస్ట్ వ్యక్తిగతంగా తనకెంతో బాధను కలగచేసిందని పేర్కొన్నారు. అధికారం శాశ్వతం కాదు.. ఒకప్పుడు కేంద్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషించిన సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడని అన్నారు. చంద్రబాబు పట్ల ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విచారకరమని పేర్కొన్నారు.
undefined
కాగా.. కొద్దిరోజుల క్రితం చంద్రబాబు అరెస్ట్‌ను తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తలసాని ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంత్రిగా పని చేశాను.. వారి అరెస్ట్ వ్యక్తిగతంగా తనకెంతో బాధను కలగచేసిందని పేర్కొన్నారు. అధికారం శాశ్వతం కాదు.. ఒకప్పుడు కేంద్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషించిన సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడని అన్నారు.
ALso Read: చంద్రబాబు అరెస్ట్ బాధాకరం.. విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదు: మంత్రి తలసాని
చంద్రబాబు పట్ల ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విచారకరమని పేర్కొన్నారు. సుమారు 73 సంవత్సరాల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం.. విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు.
అయితే చంద్రబాబు అరెస్ట్‌ను తెలంగాణలోని పలువురు రాజకీయ నాయకులు ఖండించిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు అరెస్ట్‌పై బీఆర్ఎస్‌లోని కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందించగా.. ముఖ్య నేతలు మాత్రం తొలుత స్పందించేందుకు నిరాకరించారు. ఇక, కొద్దిరోజుల క్రితం కేటీఆర్ స్పందిస్తూ.. చంద్రబాబు అరెస్టు వ్యవహారం ఏపీకి సంబంధించినదని, తమకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు.
చంద్రబాబు అరెస్ట్‌పై ధర్నాలు చేయాల్సింది అక్కడ.. కానీ హైదరాబాద్‌లో ర్యాలీలు తీస్తున్నారని అన్నారు. పక్కింట్లో పంచాయతీని ఇక్కడ తీర్చుకుంటారా అని ప్రశ్నించారు. ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అడిగారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే ఇక్కడ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కదా అని అన్నారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకూడదనే ర్యాలీలను అనుమతించడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణకు ఏపీ రాజకీయాలు అంటించొద్దని అన్నారు.