సింగరేణిపై పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఆందోళన.. ఎవరూ అడ్డు చెప్పలేదు, తెలంగాణనే ఇలా : ప్రహ్లాద్ జోషి

By Siva KodatiFirst Published Dec 7, 2022, 4:02 PM IST
Highlights

సింగరేణి బొగ్గు గనుల వేలంపై బుధవారం పార్లమెంట్‌లో రగడ జరిగింది. టీఆర్ఎస్ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. దీనిపై కేంద్ర మంత్ర ప్రహ్లాద్ జోషి వివరణ ఇచ్చారు. 

సింగరేణి బొగ్గు గనుల వేలంపై పార్లమెంట్‌లో రగడ జరిగింది. ప్రైవేటీకరణ ఆపాలని టీఆర్ఎస్ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఆందోళన నిర్వహించారు. దీనిపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కౌంటరిచ్చారు. తెలంగాణ ఎంపీల ఆరోపణల్లో వాస్తవం లేదని.. సింగరేణి సంస్థలో కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యం వుందన్నారు. వేలం మొదలైనప్పటి నుంచి ఎవరూ అభ్యంతరం చెప్పలేదని ప్రహ్లాద్ జోషి గుర్తుచేశారు. పారదర్శకంగా వేలం ప్రక్రియ నిర్వహిస్తామని.. దీనికి అంగీకరిస్తే తెలంగాణకు కూడా ప్రయోజనం వుంటుందని ఆయన తెలిపారు. కోల్‌ స్కామ్‌లో వున్నవాళ్లే పారదర్శక వేలాన్ని వ్యతిరేకిస్తున్నారని జోషి ఆరోపించారు. వేలం ప్రక్రికు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని కేంద్ర మంత్రి చెప్పారు. వేలం ద్వారా వచ్చే ఆదాయమంతా రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తుందని ప్రహ్లాద్ జోషి తెలిపారు. 

కాగా.. దేశంలోని బొగ్గు గనుల కమర్షియల్ వేలాన్ని కేంద్ర ప్రభుత్వం శనివారం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సింగరేణికి చెందిన 4 బొగ్గు గనులను కూడా వేలానికి పెట్టింది. అయితే ఇప్పటికే సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. 

ALso REad:సింగరేణి నిర్వీర్యానికి కుట్ర ఇలా.. వేలం పాటతో స్కెచ్ , టెండర్ షెడ్యూల్ ఇదే : వినోద్ కుమార్

ఇకపోతే.. బొగ్గు గనులను వేలం వేయబోమని చెప్పిన ప్రధాని మోడీ కోలిండియాను అమ్మేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు గనుల కంపెనీగా గుర్తింపు తెచ్చుకుని, లాభాల్లో వున్న కోలిండియాలో వాటాలు విక్రయించడంపై పలువురు మండిపడుతున్నారు. కోలిండియాలోని 49 శాతం వాటాలను ప్రైవేట్ వాళ్లకు విక్రయిస్తామని గతంలోనే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే కేంద్రం పావులు కదుపుతోంది

click me!