అద్భుత విజయాలు సాధిస్తున్నాం: జగిత్యాలలో కొత్త కలెక్టరేట్‌ను ప్రారంభించిన కేసీఆర్

By narsimha lodeFirst Published Dec 7, 2022, 3:26 PM IST
Highlights

జగిత్యాల కొత్త కలెక్టరేట్ భవనాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్  ఇవాళ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకు పోతుందని  చెప్పారు. 

జగిత్యాల: తెలంగాణ ఏర్పాటయ్యాక అద్భుత విజయాలు సాధించామని సీఎం కేసీఆర్  చెప్పారు. అంతేకాదు అన్నివర్గాలకు  మేలు జరిగేలా కార్యక్రమాలను రూపొందించామని కూడా ఆయన తెలిపారు. 

జగిత్యాల జిల్లాలో  నూతన కలెక్టరేట్ భవనాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్  బుధవారంనాడు సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.దేశంలోని ఇతర రాష్ట్రాలను తలదన్నేలా  తెలంగాణ రాష్ట్రం అభివృద్దిలో పురోగమిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో ఇప్పటికే దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు.మనందరి సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందన్నారు.దేశానికే ఆదర్శంగా  అనేక పనులు చేసి చూపించామని కేసీఆర్ తెలిపారు. గురుకుల విద్యతో మనకు మనమే సాటి, ఎవరూ లేరు పోటీ అని కేసీఆర్  ప్రకటించారు.

వేదనలతో రోదనలతో ఉన్న తెలంగాణకు ఏ ఇబ్బంది లేకుండా చేశామన్నారు కేసీఆర్.గతంలో తెలంగాణలో కారు చీకట్లు ఉండేవన్నారు. కానీ ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని సీఎం కేసీఆర్  తెలిపారు. 33 జిల్లాల్లో  ప్రభుత్వ వైద్య కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్టుగా సీఎం ప్రకటించారు.వ్యవసాయం చేస్తున్న రైతుల్లో ధీమా వచ్చేలా చేసినట్టుగా కేసీఆర్  తెలిపారు.గ్రామాల్లోనే ధాన్యాన్ని  కొనే ఒకే రాష్ట్రం తెలంగాణ మాత్రమమేనని కేసీఆర్ గుర్తు చేశారు.చైనా, బ్రెజిల్ తర్వాత  మొక్కల పెంపకంలో తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతుందన్నారు. ఇలాగే కృషి చేస్తే డైమండ్ ఆఫ్ ఇండియాగా ఎదగడం ఖాయమని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

రైతు బంధు ఎందుకని  కొందరు ప్రశ్నిస్తున్నారన్నారు. రాష్ట్రంలో  93 శాతం రైతులకు 5 ఎకరాలలోపు మాత్రమే భూమి ఉందన్నారు.25 ఎకరాలకు మించి ఉన్న రైతులు 0.25 మాత్రమేనన్నారు. 
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానుందని ఉద్యమ సమయంలో తాను చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశంలోనే అత్యధిక వేతనాలు తీసుకుంటున్న  ఉద్యోగులు తెలంగగాణ రాష్ట్రంలోనే  ఉన్నారని  సీఎం చెప్పారు. 

రాష్ట్రంలో  కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో కొత్త కలెక్టర్ కార్యాలయాలను  ప్రభుత్వం నిర్మిస్తుంది.  ఈ కొత్త కలెక్టరేట్ భవనాన్ని నిర్మించాలని   2017లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 20 ఎకరాల ఎస్ఆర్‌ఎస్‌పీ స్థలంలో  రూ.49.20 కోట్లతో ఈ కలెక్టరేట్ ను నిర్మించారు. నవతేజ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్  సంస్థ  ఈ కలెక్టరేట్ భవనాన్ని నిర్మించింది. 8 ఎకరాల్లో కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా రెవిన్యూ అధికారి క్యాంప్ కార్యాలయాలను నిర్మించారు.కొత్త కలెక్టరేట్ లో  32 శాఖలకు గాను  32 గదులు నిర్మించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ల కోసం మూడు పెద్ద ఛాంబర్లు, విజిటర్ల కోసం వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయి. 
 

click me!