చరిత్ర స్మరించుకోదగ్గ వీరుడు అల్లూరి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

By narsimha lode  |  First Published Jul 4, 2023, 5:33 PM IST

బ్రిటీష్ పాలకులను  వణికించిన  తెలుగు బిడ్డ అల్లూరి సీతారామరాజు  అని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  పేర్కొన్నారు. 


హైదరాబాద్: చరిత్ర స్మరించుకోదగ్గ వీరుడు అల్లూరి సీతారామరాజు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  అభిప్రాయపడ్డారు.అల్లూరి సీతారామరాజు  125వ జయంతి వేడుకల ముంగిపు సభలను  హైద్రాబాద్ లో నిర్వహించారు.ఈ సభలో  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.  కొందరు చరిత్రలో  సజీవ సాక్ష్యాలుగా నిలిస్తే  మరికొందరు  చరిత్రను సృష్టిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  చెప్పారు.

అలా  చరిత్రను సృష్టించిన వ్యక్తే  అల్లూరి సీతారామరాజు అని ఆయన గుర్తు  చేశారు.  సరికొత్త చరిత్ర, పోరాట పటిమను  ఆవిష్కరించిన వారిలో  అల్లూరి సీతారామరాజు ఒకరన్నారు. స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ వారితో పోరాటం చేసిన  తెలుగు బిడ్డడు  అల్లూరి సీతారామరాజుగా ఆయన కొనియాడారు.  అడవి బిడ్డ  అల్లూరి సీతారామరాజుకు  దేశం మొత్తం నివాళి అర్పిస్తుందన్నారు.  అల్లూరి జయంతి ఉత్సవాలను  ఏడాది పాటు నిర్వహించుకున్న విషయాన్ని ఆయన గుర్తు  చేశారు

Latest Videos

. తెలుగు పౌరుషాన్ని  ప్రపంచానికి  చాటిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని ఆయన స్మరించుకున్నారు. గొప్ప వ్యక్తుల స్మరణతోనే చరిత్రకు గుర్తింపు వస్తుందని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  చెప్పారు. . అల్లూరి జయంతి ఉత్సవాలను  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ప్రారంభించారన్నారు. అల్లూరి  జయంతి ఉత్సవాల ముగింపు  వేడుకలకు  రాష్ట్రపతి హాజరు కావడంపై ఆయన ధన్యవాదాలు తెలిపారు.

also read:హైద్రాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి: ముర్ముకు ఘనంగా స్వాగతం

అల్లూరిలో వీరత్వమే కాదు అనేక కోణాలున్నాయన్నారు. అల్లూరి సీతారామరాజు వీరుడే కాదు, వైద్యుడు, ఆధ్యాత్మిక వేత్త కూడ అని  కిషన్ రెడ్డి  చెప్పారు. వందలాది గిరిజన సైనికులను అల్లూరి సీతారామరాజు తయారు చేశారన్నారు. సూర్యచంద్రులున్నంత వరకు  విస్మరించలేని వీరుడు అల్లూరి సీతారామరాజు అని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు.

click me!