తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తామని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తామని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. బీజేపీ తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మెన్ గా ఈటల రాజేందర్ ను ఆ పార్టీ నాయకత్వం నియమించింది. పలువురు నేతలు ఈటల రాజేందర్ ను అభినందించారు. మంగళవారంనాడు హైద్రాబాద్ లో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. కార్యకర్తలా పనిచేసి బీజేపీని అధికారంలోకి తీసుకువస్తానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీతో తనకు ఎలాంటి గ్యాప్ లేదన్నారు.
జాతీయ నాయకత్వం తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయబోనన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా అడుగు జాడల్లో నడుస్తానని ఈటల రాజేందర్ చెప్పారు. తనను ప్రోత్సహిస్తున్న అమిత్ షాకు ఈటల రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు.
also read:బండి సంజయ్ రాజీనామా: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియామకం
తెలంగాణ ప్రాంత ప్రజల అంతరంగమేమిటో తనకు తెలుసునని ఈటల రాజేందర్ చెప్పారు. తెలంగాణలో రాజకీయాలు, కేసీఆర్ చేసే రాజకీయాల గురించి తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. కేసీఆర్ బలం, బలహీనతలను తెలిసినవాడినని ఈటల రాజేందర్ చెప్పారు. తన బాధ్యతను సంపూర్ణంగా నిర్వహిస్తానన్నారు. కిషన్ రెడ్డి ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా ఈటల రాజేందర్ చెప్పారు.కిషన్ రెడ్డితో కలిసి పనిచేస్తానన్నారుకేసీఆర్ ను ఓడించడం బీజేపీతోనే సాధ్యమన్నారు.
బండి సంజయ్ నేతృత్వంలో నాలుగు ఎన్నికలను గెలిచినట్టుగా ఈటల రాజేందర్ గుర్తు చేశారు. బీజేపీ గెలిస్తే ఒక కుటుంబానికి మాత్రమే లాభమన్నారు. బీజేపీ గెలిస్తే ప్రజలకు లాభమన్నారు. కానీ, రాష్ట్రంలో జరిగిన ఏ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదన్నారు. బీఆర్ఎస్ లేదా బీజేపీ విజయం సాధించిందన్నారు.