అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు .. శ్రీశ్రీ పాటను గుర్తుచేసుకున్న కేసీఆర్

Siva Kodati |  
Published : Jul 04, 2023, 05:21 PM ISTUpdated : Jul 04, 2023, 05:24 PM IST
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు .. శ్రీశ్రీ పాటను గుర్తుచేసుకున్న కేసీఆర్

సారాంశం

హైదరాబాద్ గచ్చిబౌలిలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. అల్లూరి గురించి శ్రీశ్రీ రాసిన తెల్లవారి గుండెల్లో నిదిరించిన వాడా అనే సినిమా పాటను ఇష్టంగా వినేవాడినని కేసీఆర్ పేర్కొన్నారు.

బ్రిటీష్ బంధనాల నుంచి భారతమాత విముక్తి కోసం పోరాడిన వీరుడు అల్లూరి సీతారామరాజు అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.  మంగళవారం హైదరాబాద్ గచ్చిబౌలిలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. అల్లూరి గొప్పతనాన్ని, చరిత్రను ముందు తరాలకు తీసుకెళ్లాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

అల్లూరి సీతారామరాజు దైవాంశ సంభూతుడని తాను భావిస్తానని సీఎం తెలిపారు. అల్లూరి గురించి శ్రీశ్రీ రాసిన తెల్లవారి గుండెల్లో నిదిరించిన వాడా అనే సినిమా పాటను ఇష్టంగా వినేవాడినని కేసీఆర్ పేర్కొన్నారు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని అల్లూరి సీతారామరాజు గడగడలాడించారని కేసీఆర్ ప్రశంసించారు. ఎక్కడైతే పీడన, దోపిడీ ఉంటే.. అక్కడ మహామహులు ఉద్భవించి ఉద్యమిస్తారని అన్నారు. భారతమాత గర్వంచే ముద్ధుబడ్డ అల్లూరి సీతారామరాజని ఆయన కొనియాడారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్