తెలంగాణను కల్వకుంట్ల కుటుంబానికి జీపీఏ చేశామా?: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

By narsimha lodeFirst Published May 27, 2022, 4:54 PM IST
Highlights

తెలంగాణలో మార్పు తథ్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించే నైతిక హక్కు టీఆర్ఎస్ కు లేదన్నారు. తెలంగాణను కల్వకుంట్ల కుటుంబానికి జీపీఏ గా చేశామా అని ఆయన ప్రశ్నించారు.
 

హైదరాబాద్: Telanganaలో మార్పు తథ్యమని కేంద్ర మంత్రి Kishan Reddyచెప్పారు.శుక్రవారం నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. BJPపై టీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలకు కిషన్ రెడ్డి కౌంటరిచ్చారు. హైద్రాబాద్ లో TRS సర్కార్ పై ప్రధాని మోడీ నిన్న విమర్శలు చేశారు.ఈ విమర్శలకు టీఆర్ఎస్ నేతలు స్పందించారు. టీఆర్ఎస్ నేతల విమర్శలకు కిషన్ రెడ్డి స్పందించారు.

 తమ పార్టీలో మూడేళ్లకోసారి అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందన్నారు. రెండు దఫాల కంటే అధ్యక్షుడిగా ఎవరూ కొనసాగరని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే  CM పదవిని దళితులకు ఇస్తారా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రోజు నుండి కసీఆరే సీఎంగా కొనసాగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 

also read:భద్రకాళీ ఆశీస్సులతో బయల్దేరతారు .. ఢిల్లీలో వచ్చేది కేసీఆర్ నిలబెట్టిన ప్రభుత్వమే: మంత్రి మల్లారెడ్డి

బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నిక అవుతారో తాము చెప్పలేమన్నారు. JP Nadda కుటుంబసభ్యులు ఈ పదవిని చేపట్టరని ఆయన తేల్చి చెప్పారు.ఇలా చెప్పే గుండె ధైర్యం మీకుందా అని  టీఆర్ఎస్ ను ప్రశ్నించారు కిషన్ రెడ్డి. మీది ప్రజాస్వామ్య పార్టీయేనా అని కిషన్ రెడ్డి అడిగారు.ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారా  టీఆర్ఎస్ ను ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఆత్మార్పణం చేసిన తెలంగాణ అమర వీరుల  ఆకాంక్షలను టీఆర్ఎస్ గౌరవిస్తుందా అని అడిగారు. 

ఇదేమైనా రాజుల రాజ్యమా అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ రాష్ట్రాన్ని జీపీఏ చేశారా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.మోడీని విమర్శించే నైతిక హక్కు కేసీఆర్ కు లేదన్నారు. కేసీఆర్ వైఖరిలోనే ముందుగా గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి చెప్పారు. 

సిద్దాంతపరంగా, కుటుంబ పార్టీలను తాము వ్యతిరేకిస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. కుటుంబ పార్టీలు దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు.కుటుంబ పార్టీల కారణంగా అవినీతి పెరిగిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన చెందారు. ప్రధాని మోడీ రోజుకు 18 గంటలు పనిచేస్తే కేసీఆర్ నెలకు 18 గంటలు పనిచేస్తున్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.తెలంగాణకు కేంద్రం నుండి నిధులు రాకుండానే రాష్ట్రం ముందుకు వెళ్తుందా అని  కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 

click me!