బీజేపీ బలపడుతుందనే భయంతోనే విమర్శలు: కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్

By narsimha lodeFirst Published Aug 7, 2022, 3:47 PM IST
Highlights


తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై, నీతి ఆయోగ్ పై చేసిన విమర్శలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటరిచ్చారు. తెలంగాణలో బీజేపీ బలపడుతుందనే  భయంతోనే కేసీఆర్ ఈ తరహా విమర్శలు చేస్తున్నారన్నారు. 

హైదరాబాద్: నీతి ఆయోగ్ సమావేశాన్ని  తెలంగాణ సీఎం KCR  బహిష్కరించడం దుర్మార్గమని కేంద్ర మంత్రి Kishan Reddy  చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం నాడు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.నిన్న Telangana CM కేసీఆర్ నీతి ఆయోగ్ పై, కేంద్ర ప్రభుత్వంపై చేసిన విమర్శ:లకు కేంద్ర మంత్రి కౌంటరిచ్చారు. నీతి ఆయోగ్ సిఫారసులను కేంద్రం పట్టించుకోవడం లేదని కేసీఆర్ విమర్శించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలకు సుమారు 24 వేల కోట్లు ఇవ్వాలని సిఫారసులు చేసినా  కూడా కేంద్రం నుండి చిల్లిగవ్వ కూడా రాలేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల దేశ ఆర్ధిక పరిస్థితి తిరోగమన దిశలో సాగుతుందని కేసీఆర్  నిన్న విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.  కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆర్ధికంగా ముందుకు సాగుతున్న రాష్ట్రాలకు ఇబ్బందిగా పరిణమించాయని  ఆయన ఆరోపించారు. 

Niti Ayog సమావేశానికి వచ్చి మీరు చెప్పాలనుకున్న అంశాలను చెప్పాలన్నారు. ఈ సమావేశానికి వచ్చి సూచనలు, సలహలు ఇవ్వాలన్నారు .కానీ సమావేశానికి దూరంగా ఉండడం సరైంది కాదని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. TRS  అధికారంలోకి రాకముందే తెలంగాణ ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు లేవనే అర్ధం వచ్చేలా కేసీఆర్ నిన్న మాట్లాడారన్నారు. తమ కుటుంబం లేకుంటే తెలంగాణ ప్రజలకు దిక్కేలేదన్నట్టుగా కేసీఆర్ మాట్లాడారని కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో BJP  బలపడేవరకు కేంద్ర ప్రభుత్వం చాలా మంచింది, నీతి ఆయోగ్  సిఫారసులు చాలా బాగున్నాయనే ధోరణిలో కేసీఆర్ మాట్లాడారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.

 తెలంగాణలో బీజేపీ బలపడిన తర్వాత మాత్రం దానికి భిన్నంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో తమ కుటుంబం నుండి అధికారం కోల్పోయే పరిస్థితులు వచ్చాయనే అసహనంతో కేసీఆర్ మాట్లాడుతున్నారన్నారు. 

తన కొడుకు కేటీఆర్ కు సీఎం పదవి దక్కదనే  ఆవేదనతో, అభద్రతా భావంతో కేసీఆర్ మాట్లాడుతున్నారన్నారు. అసెంబ్లీ లోపల,అసెంబ్లీ బయట పలు మార్లు కేంద్ర ప్రభుత్వాన్నికేసీఆర్ పొగిడారన్నారు. దుబ్బాకలో విజయం సాధించడం, జీహెచ్ఎంసీలో మెజారిటీ కార్పోరేట్లను గెల్చుకొన్న తర్వాత  బీజేపీపై., ప్రధాని మోడీపై విష ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ తీరును ఎండగట్టారు  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

also read:అన్ని కాకి లెక్కలే.. కేసీఆర్ ప్రశ్నల్లో ఒక్కదానికైనా సమాధానమిచ్చారా : నీతి ఆయోగ్ ప్రకటనపై హరీశ్

 ఆజాదీకా అమృత్ మహోత్సవంలో అందరూ భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. ప్రతి ఇంటి.పై జాతీయ జెండాను ఆవిష్కరించాలని ఆయన కోరారు.ఈ విషయమై అన్ని రాష్ట్రాలతో హోం మంత్రి అమిత్ షా కలిసి సమావేశాలు నిర్వహించినట్టుగా కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అంతేకాదు ఇదే విషయమై అన్ని పార్టీలు, అన్ని రాష్ట్రాల సీఎంలకు కూడా లేఖ రాసినట్టుగా కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ప్రతి ఇంటిపై జాతీయజెండాలు ఎగుర వేయాలంటే జెండాల కొరత ఉందన్నారు

click me!