నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయిన తర్వాత దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇవాళ హైద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్: మోడీ ప్రధానమంత్రి అయ్యాక దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
ఆదివారం నాడు కేంద్ర మంత్రి Kishan Reddy హైద్రాబాద్ లోని BJP కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అవినీతి లేకుండా కేంద్ర ప్రభుత్వం పాలన సాగుతుందన్నారు. ఒక్క రూపాయి కూడా దర్వినియోగం కాకుండా కేంద్రం పాలన సాగిస్తుందని కిషన్ రెడ్డి వివరించారు. కేంద్ర ప్రభుత్వానికి 58 శాతం పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని దేశంలో మౌళిక వసతులు, రక్షణ అవసరాలకు వినియోగిస్తున్నట్టుగా కిషన్ రెడ్డి వివరించారు. ఒక్క పైసా కూడా దుర్వినియోగం చేయడం లేదని తేల్చి చెప్పారు. దేశంలో ఎయిర్ పోర్టులు, జల మార్గాలు, రైల్వేలు, రోడ్ల నిర్మానం చేపట్టినట్టుా కిసన్ రెడ్డి తెలిపారు.
undefined
Petrol, డీజీల్ ధరలపై పన్నులను కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు తగ్గించిందని ఆయన చెప్పారు. దీంతో రూ. 2 లక్షల 20 వేల కోట్లు కేంద్రం ఆదాయం కోల్పోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు.
భారతదేశం తలుచుకొంటే ఏమైనా చేస్తుందని నిరూపించిన విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. Pakistan లో టెర్రరిస్ట్ క్యాంపులపై దాడులను ఆయన గుర్తు చేశారు. రక్షణ రంగంలో కూడా దేశీయ ఉత్పత్తులను పెంచుకొన్నట్టుగా చెప్పారు. బుల్లెట్ ఫ్రూఫ్ నుండి యుద్ధ విమానాల వరకు దేశీయ రంగంలోనే ఉత్పత్తి చేస్తున్నట్టుగా మంత్రి చెప్పారు. 2851 రక్షణ రంగానికి చెందిన పరికరాలను దేశంలోనే తయారు చేస్తున్నట్టుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
also read:తెలంగాణను కల్వకుంట్ల కుటుంబానికి జీపీఏ చేశామా?: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
గతంలో రక్షణ రంగానికి చెందిన పరికరాలు 98 శాతం విదేశాల నుండి దిగుమతి చేసుకొనేవారమన్నారు. వైద్య రంగంలో కూడా పెద్ద ఎత్తున దేశీయంగానే ఉత్పత్తి చేస్తున్నామన్నారు. అభివృద్ది చెందిన దేశాలు కూడా ఇండియాలో తయారైన వ్యాక్సిన్ ను కోరుకుంటున్నాయన్నారు. Corona వ్యాక్సిన్ ప్రపంచంలోనే పలు దేశాలకు సరఫరా చేసిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. Farmers పంండించే గిట్టుబాటు ధర రూ. 1300ల నుండి రూ. 1960కి పెంచామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు.