
హైదరాబాద్ (hyderabad) శంషాబాద్‌లో (shamshabad) పోకిరిలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళల పట్ల వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. కిశోర్ అనే యువకుడు బైక్‌పై వేగంగా వచ్చి మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. తేరుకుని ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు వేగంగా పారిపోతున్నాడు. ప్రతిరోజూ అతను మహిళలను వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు కిశోర్‌ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.