అంబర్‌పేటలో కిషన్ రెడ్డి పాదయాత్ర.. అధికారులు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం..

Published : Jan 23, 2023, 12:00 PM IST
అంబర్‌పేటలో కిషన్ రెడ్డి పాదయాత్ర.. అధికారులు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం..

సారాంశం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు తమ సమస్యలను కిషన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. పలువురు ప్రజలు పాదయాత్ర చేస్తున్న కిషన్ రెడ్డికి విద్యుత్ సమస్య గురించి వివరించారు.  ఈ క్రమంలోనే సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు ఫోన్ చేసిన కిషన్ రెడ్డి.. సమస్యల పరిష్కారం కోసం తాము ప్రజల్లో తిరుగుతుంటే ‘‘మీరెక్కడ’’ అంటూ ప్రశ్నించారు. 

వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. స్థానిక ఎంపీ తిరుగుతుంటే.. సమాచారం ఇచ్చిన కూడా అధికారులు రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇక, బస్తీల్లో వాటర్ పైప్ లైన్‌ కోసం తీసిన కాలువలు పూడ్చాలని సంబంధిత అధికారులను మంత్రి కిషన్ రెడ్డి ఆదేశించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!