కాంగ్రెస్ అమ్ముడుపోయే పార్టీ .. బీఆర్ఎస్ కొనుగోలు చేసే పార్టీ : కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

కాంగ్రెస్ అమ్ముడుపోయే పార్టీ అని.. బీఆర్ఎస్ కొనుగోలు చేసే పార్టీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌కు అమ్ముడుపోయారా .. లేదా .. ఆ పార్టీ చెప్పాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.


పదేళ్ల క్రితం ఇదే స్టేడియానికి గుజరాత్ సీఎంగా మోడీ వచ్చారని గుర్తుచేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మంగళవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ బీసీల ఆత్మగౌరవ సభలో ఆయన ప్రసంగిస్తూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ ఒకే తాను ముక్కలన్నారు. మన్మోహన్ సింగ్ హయాంలో కేసీఆర్ కేంద్ర మంత్రిగా వున్నారని.. కాంగ్రెస్ హయాంలో టీఆర్ఎస్ నేతలు మంత్రులుగా వున్నారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. పదేళ్ల క్రితం ఎల్బీ స్టేడియంలో జరిగిన సభ దేశంలో మార్పునకు నాంది అయ్యిందని.. ఆ సభ తర్వాతనే మోడీ ప్రధాని అయ్యారని కిషన్ రెడ్డి తెలిపారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్ధిగా వస్తే కేసీఆర్ పట్టించుకోలేదని.. కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్ధికి బీఆర్ఎస్ ఘన స్వాగతం పలికిందని ఆయన పేర్కొన్నారు. 

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌కు అమ్ముడుపోయారా .. లేదా .. ఆ పార్టీ చెప్పాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ అమ్ముడుపోయే పార్టీ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో రాష్ట్రంలో మార్పు రాదని కేంద్ర మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అమ్ముడుపోయే పార్టీ అని.. బీఆర్ఎస్ కొనుగోలు చేసే పార్టీ అని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, రెండు పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని ఆయన చురకలంటించారు. 

Latest Videos

ALso Read: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ నేతలకు సంబంధాలు.. ఎవరిని వదలేది లేదు : మోడీ హెచ్చరికలు

ఇదే సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల్లో అహంకారం కనిపిస్తోందని .. అవినీతి సర్కారును ఇంటికి పంపడం ఖాయమని మోడీ జోస్యం చెప్పారు. ఢంకా భజాయించి చెబుతున్నా.. బీఆర్ఎస్ ఓటమి ఖాయమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే నాణేనికి వున్న రెండు ముఖాలని.. తెలంగాణ యువతను బీఆర్ఎస్ సర్కార్ మోసం చేసిందని మోడీ దుయ్యబట్టారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ల లీకేజ్.. యువత జీవితాలను దుర్బరం చేసిందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. వేల సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా వున్నాయని.. తప్పు చేసినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోడీ పేర్కొన్నారు.

పేదలకు ఐదేళ్ల పాటు ఉచితంగా బియ్యం అందిస్తామని, పేదలకు ఉచిత రేషన్ .. ఇది మోడీ ఇస్తున్న గ్యారెంటీ అన్నారు. లిక్కర్ స్కామ్‌పై దర్యాప్తు చేస్తుంటే ఈడీ, సీబీఐని ఇక్కడి నేతలు తిడుతున్నారని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిని అంతం చేస్తాం.. ఇది మోడీ గ్యారెంటీ అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో నిజమైన అభివృద్ధి కనిపించడం లేదని.. తెలంగాణలో మార్పు తుఫాను కనిపిస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు.

అన్ని నియామకాల పరీక్షల్లో అవకతవకలు కామన్ అయిపోయాయని మోడీ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలకు ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధాలు వున్నాయని.. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రధాని ఆకాంక్షించారు. ఎవరు ప్రజాధనాన్ని దోచుకున్నారో.. వారి నుంచి తిరిగి రాబడతామని మోడీ హెచ్చరించారు. తెలంగాణ యువతను మోసం చేసిన బీఆర్ఎస్‌ను సాగనంపాలా .. వద్దా అని ప్రధాని ప్రశ్నించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్‌కు గుణపాఠం చెప్పారని మోడీ దుయ్యబట్టారు.  
 

click me!