నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందాయా : పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు

నీళ్లు , నిధులు, నియామకాల కోసం జరిగిన పోరాటమే తెలంగాణ ఉద్యమం అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. మోడీ ఎన్నికలనే దృష్టిలో పెట్టుకుంటే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకునేవారు కాదని జనసేనాని స్పష్టం చేశారు. ఎన్నికలనే దృష్టిలో పెట్టుకుంటే మహిళా బిల్లు తెచ్చేవారు కాదని జనసేనాని పేర్కొన్నారు.


నీళ్లు , నిధులు, నియామకాల కోసం జరిగిన పోరాటమే తెలంగాణ ఉద్యమం అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. మంగళవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ బీసీల ఆత్మగౌరవ సభలో ఆయన ప్రసంగిస్తూ.. నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందాయా అన్నదే ప్రశ్న అన్నారు. దేశ ప్రయోజనాలే మోడీని నిర్దేశిస్తాయి కానీ.. ఎన్నికల ప్రయోజనాలు కాదన్నారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఉగ్రదాడులు తగ్గిపోయాయని పవన్ ప్రశంసించారు. 

అంతర్జాతీయంగా భారత్‌ను అగ్రగామిగా నిలబెట్టింది మోడీయేనని ఆయన పేర్కొన్నారు. ప్రతి భారతీయుడి గుండెల్లో ధైర్యం నింపిన నేత మోడీ అని అన్నారు. మోడీ ఎన్నికలనే దృష్టిలో పెట్టుకుంటే ఆర్టికల్ 370 రద్దు చేసేవారు కాదని పవన్ పేర్కొన్నారు. మోడీ ఎన్నికలనే దృష్టిలో పెట్టుకుంటే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకునేవారు కాదని జనసేనాని స్పష్టం చేశారు. ఎన్నికలనే దృష్టిలో పెట్టుకుంటే మహిళా బిల్లు తెచ్చేవారు కాదని జనసేనాని పేర్కొన్నారు. నా లాంటి కోట్ల మంది కన్నకలలకు ప్రతిరూపమే నరేంద్ర మోడీ అని ప్రశంసించారు పవన్. సకల జనులు సమరం చేస్తేనే తెలంగాణ వచ్చిందని ఆయన గుర్తుచేశారు. 
 

Latest Videos

click me!