ఏపీ, తెలంగాణ మధ్య విభజన సమస్యలు: కేంద్ర హోంశాఖ నేతృత్వంలో నేడు కీలక భేటీ

By narsimha lode  |  First Published Sep 27, 2022, 11:53 AM IST

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాస్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ఇవాళ సమావేశం నిర్వహిస్తుంది. రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. 


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యల పరిస్కారం కోసం కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లా నేతృత్వంంలో ఈ సమావేశం సాగుతుంది.ఈ సమావేశానికి రెండు రాష్ట్రాలకు చెందిన కీలక అధికారులు హాజరయ్యారు. అయితే కేంద్రప్రభుత్వానికి చెందిన 12 శాఖలకు చెందిన సెక్రటరీ స్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గతంలో హోంశాఖకు చెందిన అధికారులు మాత్రమే ఈ సమావేశంలో పాల్గొనేవారు. 14 అంశాలను ఇవాళ్టి సమావేశం ఎజెండాలో చేర్చారు. ఏడు అంశాలు రెండు రాష్ట్రాలకు చెందినవి. మరో ఏడు అంశాలు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి.

విభజన చట్టానికి చెందిన సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే 25 సమావేశాలు జరిగాయి.ఈ ఏడాది మూడు దఫాలు సమావేశాలు నిర్వహించారు. ఇవాళ్టి సమావేశం నాలుగోది.  ఈ సమావేశంలో తమ రాష్ట్రానికి చెందిన అంశాలను  నొక్కి చెప్పాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.ఈ విషయమై తెలంగాణకు చెందిన అధికారులతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. మరో వైపు ఏపీ ప్రభుత్వం కూడా తమ సమస్యలపై ఈ సమావేశంలో ప్రస్తావించనుంది.

Latest Videos

undefined

విభజన సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. గత మాసంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. విభజన సమస్యలను పరిష్కరించాలని కోరారు. దీంతో కేంద్ర ప్రభుత్వం విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్రీకరించింది.

also read:విభజన చట్టంలోని అనేక అంశాల్లో తెలంగాణకు అన్యాయం: అసెంబ్లీలో కేసీఆర్

9, 10 షెడ్యూల్ సంస్థల విభజనపై రెండు రాష్ట్రాల మధ్య చాలా కాలంగా సమస్యలున్నాయి. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొనని సంస్థల విభజనపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్,. అప్పులు, ఆస్తుల విభజన వంటి అంశం ఈ సమావేశంలో చర్చకు రానుంది. సింగరేణి సంస్థ తమ రాష్ట్రానికే చెందుతుందని తెలంగాణ వాదిస్తుంది. ఈ సంస్థల ఆస్తులపై దావా వేసే అవకాశం లేదని కూడా తెలంగాణ వాదిస్తుంది. 
 

click me!