టీచర్స్ యూనియన్ నేతను బూతులు తిట్టిన మంచిర్యాల డీఈవో.. వైరల్‌గా మారిన ఆడియో..!

By Sumanth KanukulaFirst Published Sep 27, 2022, 11:42 AM IST
Highlights

మంచిర్యాల జిల్లా విద్యాధికారి(డీఈవో) తీరు వివాదస్పదమైంది. టీచర్స్ యూనియన్ నాయకుడిపై డీఈవో వెంకటేశ్వర్లు నోరుపారేసుకున్నట్టుగా చెబుతున్న ఆడియో ఒకటి వైరల్ అవుతుంది. 

మంచిర్యాల జిల్లా విద్యాధికారి(డీఈవో) తీరు వివాదస్పదమైంది. టీచర్స్ యూనియన్ నాయకుడిపై డీఈవో వెంకటేశ్వర్లు నోరుపారేసుకున్నట్టుగా చెబుతున్న ఆడియో ఒకటి వైరల్ అవుతుంది. దసరా సెలవుల్లో కూడా ప్రైవేట్ టీచర్లను స్కూల్స్‌కు రప్పిస్తున్నారని టీచర్స్ యూనియన్ నేత ఒకరు డీఈవోకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో డీఈవో ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడారు. బూతులు కూడా తిట్టాడు. ఇందుకు సంబంధించిన ఆడియో బయటకు రావడంతో డీఈవో తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

వైరల్ అవుతున్న ఆడియో క్లిప్ ప్రకారం.. డీఈవోకు ఫోన్ చేసిన టీచర్స్ యూనియన్ నేత.. మంచిర్యాల, బెల్లంపల్లిలో కొన్ని ప్రైవేట్ స్కూల్స్ రన్ అవుతున్నాయని చెప్పారు. కొందరు టీచర్లను పిలిచి.. టెన్త్ క్లాస్ తరగతులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అయితే దీనిపై స్పందించిన డీఈవో.. మీరు టీచర్లను ఎందుకు పంపిస్తున్నారంటూ టీచర్స్ యూనియన్ నేతపై ఎదురుదాడికి దిగారు. ముందు టీచర్లను కరెక్ట్‌గా పెట్టుకోవాలని  అన్నారు. మీకు తెలియదా? బుద్ది లేదా? అంటూ బూతుపురాణం అందుకున్నారు. 
 

click me!