Hyderabad: మహిళ హత్య.. ప్లాస్టిక్ బ్యాగ్‌లో కుళ్లిపోయినన స్థితిలో మృతదేహం లభ్యం

Published : Apr 13, 2023, 02:20 AM IST
Hyderabad: మహిళ హత్య.. ప్లాస్టిక్ బ్యాగ్‌లో కుళ్లిపోయినన స్థితిలో మృతదేహం లభ్యం

సారాంశం

హైదరాబాద్‌లో ఓ మహిళ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. మూడు రోజుల క్రితం హత్యచేసిన ఓ ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఆ డెడ్ బాడీని నగర శివారులో వదిలిపెట్టి వెళ్లినట్టు పోలీసులు చెప్పారు.  

హైదరాబాద్: గుర్తు తెలియని ఓ మహిళ మృత దేహం కుళ్లిపోయిన స్థితిలో హైరదాబాద్‌లో కనిపించింది. పహాడీ షరీఫ్ శివారులో మంగళవారం రాత్రి ఈ డెడ్ బాడీ లభించింది. ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఆ డెడ్ బాడీ ప్యాక్ చేసి ఉన్నది.

పోలీసుల వివరాల ప్రకారం, తుక్కుగూడ- శ్రీశైలం హైవే దారిలో హార్డ్ వేర్ పార్క్ దగ్గర కుళ్లిపోయిన స్థితిలో ఓ డెడ్ బాడీని స్థానికులు గుర్తించారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పహాడీ షరీఫ్ పోలీసు స్టేషన్  పరిధిలో ఈ డెడ్ బాడీ లభించింది. అంటే రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో లభించింది.

ఆ మహిళను టవల్‌తో గొంతు నులిమి చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత ఆ డెడ్ బాడీని నిర్మానుష్య ప్రాంతంలో వదిలిపెట్టి ఉంటారని చెబుతున్నారు. ఆ మహిళను మూడు రోజుల క్రితం హత్యచేసి ఉండొచ్చని వివరించారు. ఆ డెడ్ బాడీ కుళ్లిపోయిన స్థితిలో ఉన్నదని తెలిపారు. ఆ మహిళను గుర్తించడానికి, హంతకులనూ పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పడినట్టు ఏసీపీ మహేశ్వరం, సీ అంజయ్య వివరించారు.

Also Read: డబుల్ మర్డర్ కేసు: సెక్స్ చాట్స్, రహస్య కలయికలు.. ఒక సాధారణ గృహిణి ఎలా నేరాలు చేయగలిగిందంటే?

పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లైంట్‌లను పరిశీలించి మృతు రాలిని గుర్తిస్తామని పోలీసులు వివరించారు. అలాగే, ఈ ఘటనపై కేసు నమోదు చేశామని తెలిపారు. కేసులో దర్యాప్తు కూడా ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం