ఏమైనా వుంటే ఇన్‌ఛార్జ్‌తో మాట్లాడుకోవచ్చు : మహేశ్వర్ రెడ్డికి షోకాజ్ నోటీసులపై రేవంత్ రెడ్డి స్పందన

Siva Kodati |  
Published : Apr 12, 2023, 07:28 PM ISTUpdated : Apr 12, 2023, 07:32 PM IST
ఏమైనా వుంటే ఇన్‌ఛార్జ్‌తో మాట్లాడుకోవచ్చు : మహేశ్వర్ రెడ్డికి షోకాజ్ నోటీసులపై రేవంత్ రెడ్డి స్పందన

సారాంశం

మహేశ్వర్ రెడ్డికి షోకాజ్ నోటీసుల వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో దుమారం రేపుతోంది. ఈ క్రమంలో దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. మహేశ్వర్ రెడ్డికి ఏమైనా అనుమానాలుంటే ఇన్‌ఛార్జ్‌తో మాట్లాడుకోవచ్చని రేవంత్ పేర్కొన్నారు. 

టీపీసీసీ సీనియర్ నేత మహేశ్వర్ రెడ్డికి షోకాజ్ నోటీసులపై స్పందించారు రేవంత్ రెడ్డి . ఆయనకు తనకు మంచి మిత్రుడని.. రెండ్రోజుల క్రితం కూడా తాము మాట్లాడుకున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. షోకాజ్ నోటీస్ అనేది పార్టీ అంతర్గత వ్యవహారమని.. అయినప్పటికీ మహేశ్వర్ రెడ్డికి ఏమైనా అనుమానాలుంటే ఇన్‌ఛార్జ్‌తో మాట్లాడుకోవచ్చని రేవంత్ పేర్కొన్నారు. 

అంతకుముందు తనకు  షోకాజ్  నోటీసు  ఇవ్వడంపై   ఎఐసీసీ చీఫ్  మల్లికార్జున ఖర్గేని కలిసి  తేల్చుకుంటానని   కాంగ్రెస్  నేత  మహేశ్వర్ రెడ్డి  చెప్పారు. టీపీసీసీ  నుండి షోకాజ్ నోటీసు ఇవ్వడంపై  మహేశ్వర్ రెడ్డి  స్పందించారు.  బుధవారంనాడు  ఆయన   హైద్రాబాద్ లో మీడియాతో మాట్లడారు.  తనకు  షోకాజ్  ఎందుకు  ఇచ్చారో రేపటి లోపుగా   వివరణ ఇవ్వాలని  మహేశ్వర్ రెడ్డి డిమాండ్  చేశారు 

ALso Read: ఖర్గే వద్దే తేల్చుకుంటా: షోకాజ్ నోటీసులపై మహేశ్వర్ రెడ్డి ఫైర్

పీఏసీలో   తాను  ఉండడం ఇష్టం లేకపోతే  రాజీనామా చేస్తానని ప్రకటించారు. పార్టీ మారుతానని  తాను  ఎక్కడా  చెప్పలేదని.. అందువల్ల తాను  వివరణ ఇవ్వాల్సిన  అవసరం లేదన్నారు. క్రెడిబులిటీ  లేని వాళ్లు  తనకు   నోటీసులు  ఇచ్చారని పీసీసీ నాయకత్వంపై  మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.  బ్లాక్  మెయిల్  చేసి పార్టీ మారిన వ్యక్తిత్వం  తనది కాదని పరోక్షంగా  రేవంత్ పై  ఆయన  విమర్శలు గుప్పించారు. తన విషయలో పీసీసీ  ఏ నిర్ణయం తీసుకున్నా  ఇబ్బంది లేదని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. 

తనకు  కారణం లేకుండా  నోటీస్  ఇస్తారా అని  ఆయన  ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను  పార్టీ వ్యతిరేక  కార్యక్రమాలు  చేయలేదని  .. రేవంత్ రెడ్డిపైనా  బహిరంగంగా  కూడా ఆరోపణలు చేయలేదని  మహేశ్వర్ రెడ్డి గుర్తు  చేశారు. ఎథిక్స్ తో  రాజకీయాలు చేశానని.. కొత్తగా పార్టీలోకి వచ్చిన  వ్యక్తులకు  రూల్స్  తెలియవన్నారు. ఎఐసీసీ  కార్యక్రమాల కమిటీ  అమలు  చైర్మెన్ గా  ఉన్న తనకు  పీసీసీ  ఎలా   షోకాజ్  నోటీసులు  ఎలా ఇస్తుందని  ఆయన ప్రశ్నించారు.  

PREV
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!