డబుల్ మర్డర్ కేసు: సెక్స్ చాట్స్, రహస్య కలయికలు.. ఒక సాధారణ గృహిణి ఎలా నేరాలు చేయగలిగిందంటే?

ఢిల్లీలో డబుల్ మర్డర్ కేసు సంచలనంగా మారింది. ఓ గృహిణి అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం భర్త, అత్తమామలకు తెలియడంతో ఆమెపై కఠిన నిఘా వేశారు.  దీంతో అత్తమామలను అంతమొందించాలని ఆమె లవర్‌తో ప్లాన్ వేసింది. చోరీకి వచ్చినట్టుగా లవర్, మర వ్యక్తి ఆ ఇంటిలోకి చొరబడి వారిద్దరిని ప్రొఫెషనల్‌ క్రిమినల్స్‌గా చంపేసి వెళ్లిపోయారు. ఈ కేసులో సాధారణ గృహిణి అంతటి నేరాలను ఎలా చేయగలిగిందనే ఆశ్చర్యాలు వ్యక్తమయ్యాయి.
 

delhi double murder case, how house wife spiral into crime, shocking details of the case kms

న్యూఢిల్లీ: ఆమె గృహిణి. నాలుగేళ్ల వైవాహిక జీవితం సాఫీగా సాగింది. ఐదేళ్ల కొడుకు. అంతాబాగానే ఉన్నదనుకున్న సమయంలో ఒక అక్రమ సంబంధం వారి జీవితాన్ని నాశనం చేసింది. ఆమె తన అత్త, మామలను చంపేయాలని నిర్ణయించుకుంది. తన లవర్‌తో సంబంధాన్ని కొనసాగించనివ్వకుండా అనేక ఆంక్షలు విధిస్తున్నారనే కారణంగానే ఈ నిర్ణయానికి వచ్చింది. తన లవర్‌తో కలిసి మర్డర్ ప్లాన్ వేసింది. ఇంటిలో చోరీ జరిగినట్టుగా కనిపించాలని, కానీ, అందులో ఇద్దరు హతమవ్వాలని ప్రణాళిక వేసింది. ప్లాన్ ప్రకారమే హత్యలు చేశారు. తర్వాత సిమ్ కార్డుల సహాయంతో పోలీసులకు చిక్కారు. కానీ, సాధారణ గృహిణిగా ఉన్న ఆ మహిళ ఇంతటి నేరప్రవృత్తిని ఎలా ఒంటబట్టించుకుందా? అనే ఆశ్చర్యాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ డబుల్ మర్డర్ కేసుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇవే.

29 ఏళ్ల మోనికా వర్మ.. తన బాయ్‌ఫ్రెండ్ ఆశిశ్‌(29)తో కలిసి ఢిల్లీలో ఈ దారుణానికి పాల్పడింది. మోనికా వర్మ ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేసింది. పెళ్లికి ముందు నోయిడాలోని ఓ కాల్ సెంటర్‌లో పని చేసింది. 22 ఏళ్లకు (2016)పెళ్లయింది. నాలుగేళ్ల వారి వైవాహిక దాంపత్యం ఆమెను ఒంటరిదాన్ని చేసింది. కరోనా కాలంలో లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైనప్పుడు ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. ఆన్‌లైన్‌లో ఫ్రెండ్స్ చేసుకుంది. ఇందులో ఆశిశ్ ఒకడు. ఆగస్టు 2022లో వారి ఫ్రెండ్షిప్ మొదలైంది. తరుచూ చాట్ చేసుకునేవారు. ఆ తర్వాత ఒకరిపట్ల ఒకరు ఇష్టం పెంచుకున్నారు. ఆ చాట్లు.. సెక్స్ చాట్లుగా మారిపోయాయి. చివరకు 2021 ఫిబ్రవరిలో వాలెంటైన్స్ డే నాడు ఓ హోటల్‌లో వారు రహస్యంగా కలుసుకున్నారు. ఘజియాబాద్‌లో అలా హోటల్స్‌లో రహస్యంగా కలుసుకోవడాలు పెరిగిపోయాయి.

Also Read: మల విసర్జన చేస్తుండగా పాము పొట్టలోకి వెళ్లిందని హాస్పిటల్‌కు పరుగు.. వైద్యులు ఏమన్నారంటే?

ఆమె ఆశిశ్ ఇంటికి ఆయన గర్ల్‌ఫ్రెండ్‌గా వెళ్లింది. అయితే, మోనికాకు వివాహిత అని, ఒక పిల్లాడి తల్లి అని తెలుసుకున్న ఆశిశ్ తల్లి వారి సంబంధాన్ని తిరస్కరించింది. కానీ, వారిద్దరూ విడిపోవాలని అనుకోలేదు. 

మోనికా సెక్స్ చాట్లను భర్త రవి గతేడాది చూసిన తర్వాత పరిస్థితులు వేగంగా మారాయి. ఆమెపై నిఘా పెంచాడు. స్మార్ట్ ఫోన్ తీసేసి ఫీచర్ ఫోన్ చేతికి ఇచ్చారు. మోనికాను అత్త ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండేది. అయినా.. సెక్స్‌టింగ్స్ తగ్గాయి గానీ, కాల్స్ మాట్లాడుకోవడాలు, బయట రహస్యంగా కలుసుకోవడాలు తగ్గలేదు.

Also Read: శృంగారంలో రిస్కీ పొజిషన్ ట్రై చేయడంతో పురుషాంగం ఫ్రాక్చర్.. ఎమర్జెన్సీ సర్జరీ చేసిన వైద్యులు

‘ఇల్లు నాకు ఒక జైలుగా మారింది. ప్రతి కదలికను భూతద్దంలో పెట్టి చూశారు. నా జీవితాన్నే వారు కంట్రోల్ చేయాలని అనుకున్నారు. నా గొంతు నొక్కారు... ఈ హత్యలపై నాకు పశ్చాత్తాపమేమీ లేదు’ అని మోనికా దర్యాప్తు అధికారులకు తెలిపింది. తన అత్త వీణా ఎప్పుడూ తనపై నుంచి చూపు తీసేది కాదని, అందుకే ఇంట్లో గొడవలు పెరిగిపోయాయని వివరించింది.

ఆ తర్వాత ఢిల్లీలోని గోకుల్‌పురిలోని ఇంటిని అమ్మేసి ద్వారకాలో ఇల్లు కొనుక్కోవాలని భర్త రవి డిసైడ్ అయ్యాడు. రూ. 1.5 నుంచి 2 కోట్ల వరకు వస్తే.. ఆ డబ్బులతో ఇల్లు కొనుక్కోవాలని అనుకున్నాడు. కానీ బయ్యర్లు రాలేదు. దీంతో ఇంటిని పోర్షన్లుగా అమ్మాలని అనుకున్నాడు. అప్పుడు ఓ పార్టీ ఇల్లు కొనుగోలు చేయడానికి వచ్చింది. రూ. 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చింది. అప్పుడు తన మర్డర్ ప్లాన్‌ను అమలు చేయాలని మోనికా అనుకుంది. ఫిబ్రవరి 12న అడ్వాన్స్ రాగా.. ఫిబ్రవరి 20వ తేదీన వారు హోటల్‌లో కలుసుకుని మర్డర్ ప్లాన్‌కు తుది మెరుగులు దిద్దారు. ఆ తర్వాత అమలు చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios