హైదరాబాద్ లో అర్ధరాత్రి ఘోర ప్రమాదం... ఇద్దరు యువకుల దుర్మరణం

Published : Apr 09, 2023, 01:42 PM ISTUpdated : Apr 09, 2023, 01:44 PM IST
హైదరాబాద్ లో అర్ధరాత్రి ఘోర ప్రమాదం... ఇద్దరు యువకుల దుర్మరణం

సారాంశం

హైదరాబాద్ శివారులో అర్థరాత్రి జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. 

హైదరాబాద్ : అర్ధరాత్రి వేగంగా దూసుకెళుతున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఆగివున్న లారీని ఢీకొట్టిన దుర్ఘటన హైదరాబాద్ శివారులో చోటుచేసుకుంది.  ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. 

గత అర్థరాత్రి మూడు గంటల సమయంలో ఇద్దరు యువకులు కారులో కొంపల్లి నుండి మేడ్చల్ వైపు వెళుతూ ప్రమాదానికి గురయ్యారు.రోడ్డుపై కారు వేగంగా దూసుకెళుతూ ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో రోడ్డుపక్కన ఆగివున్న లారీని అదే వేగంతో వెళ్లి ఢీ కొనడంతో కారులోని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. కారు కూడా తుక్కుతుక్కయ్యింది. 

Read More  హైదరాబాద్ లో విషాదం... ముక్కుపచ్చలారని చిన్నారి ప్రాణాలుతీసిన మస్కిటో కిల్లర్

రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. కారులో ఇరుక్కుపోయిన యువకుల మృతదేహాలను బయటకుతీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఈ ప్రమాదానికి అతివేగమే కారణమా లేక వీకెండ్ కాబట్టి యువకులు మద్యంమత్తులో ఏమైనా కారు నడిపారా అన్నది తెలియాల్సి వుంది.కారు నెంబర్ ఆధారంగా యువకుల వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గా


 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?