ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు పార్టీలో గ్రూపు తగాదాలను బట్టబయలు చేశాయి.
ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, ఎంపీపీ తుల శ్రీనువాస్ వర్గాలు పోటీపడ్డారు. ఎంపీపీ వర్గం సమావేశం నిర్వహించే ఫంక్షన్ హల్ కు ఎమ్మెల్యే తాళం వేయించాడు. దీంతో ఎంపీపీ వర్గీయులు నిరసనకు దిగారు. ఎమ్మెల్యే కు వ్యతిరేకంంగా నినాదాలు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. అయితే బోథ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇవాళ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించేందుకు ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇవాళే బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ వర్గీయులు భరోసా పేరుతో బోథ్ లో ని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకన్న ఎమ్మెల్యే బాపూరావు వర్గీయులు ఎంపీపీ సమావేశం నిర్వహిస్తున్న ప్రైవేట్ ఫంక్షన్ హాల్ కు తాళం వేయించారు. ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం విషయం తమకు తెలియదని ఎంపీపీ తుల శ్రీనివాస్ వర్గీయులు చెబుతున్నారు. కేసీఆర్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుెళ్లేందుకు గాను కేసీఆర్ భరోసా పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా తలు శ్రీనివాస్ వర్గీయులు చెబుతున్నారు. ఉద్దేశ్యపూర్వకంగా తుల శ్రీనివాస్ ఈ సమావేశం ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తున్నారు.
ఎంపీపీ తుల శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే నగేష్ అనుచరుడు. ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా ఎంపీపీ తుల శ్రీనివాస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు పార్టీలోని గ్రూపు తగాదాలు బహిర్గతం చేశాయి.