హైదరాబాద్‌ : రెడీమిక్స్ యంత్రంలో పడి ఇద్దరు కార్మికులు దుర్మరణం.. నుజ్జునుజ్జయిన మృతదేహాలు

హైదరాబాద్ పుప్పాలగూడలో విషాదం చోటు చేసుకుంది. కాంక్రీట్‌ను రెడీమిక్స్ చేసే యంత్రంలో ప్రమాదవశాత్తూ పడి ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలయ్యారు.

two workers crushed to death by concrete mixer in hyderabad ksp

హైదరాబాద్ పుప్పాలగూడలో విషాదం చోటు చేసుకుంది. కాంక్రీట్‌ను రెడీమిక్స్ చేసే యంత్రంలో ప్రమాదవశాత్తూ పడి ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. శనివారం రెడీ మిక్స్‌ను శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో కార్మికుల శరీరాలు నుజ్జునుజ్జు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మరోవైపు మృతుల కుటుంబ సభ్యులు .. నిర్మాణ సంస్థ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. మృతులను బేటా సోరేన్ , సుశీల్ ముర్ముగా గుర్తించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

vuukle one pixel image
click me!