మైనంపల్లి ఓ రౌడీ.. బీఆర్ఎస్‌ గెంటేస్తే కాంగ్రెస్‌లో చేరాడు , ఆయన గెలిచేది లేదు : మల్లారెడ్డి ఘాటు వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Nov 4, 2023, 3:33 PM IST

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావులపై మండిపడ్డారు మంత్రి మల్లారెడ్డి. కాంగ్రెస్‌లోకి వెళ్లాక ఆయన పిచ్చోడు అయ్యాడని.. మైనంపల్లి మళ్లీ గెలిచేది లేదని మల్లారెడ్డి జోస్యం చెప్పారు. 
 


టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావులపై మండిపడ్డారు మంత్రి మల్లారెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ సభ్యుడిగా మల్కాజిగిరి నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఆయన సీఎం అయితే రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తాడని నిలదీశారు. కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటూ అప్పుడే మంత్రి పదవులు పంచుకుంటున్నారని చురకలంటించారు. మైనంపల్లి హనుమంతరావు ఓ రౌడీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి గెంటేస్తే కాంగ్రెస్‌లో చేరి పోటీ చేస్తున్నాడని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌లోకి వెళ్లాక ఆయన పిచ్చోడు అయ్యాడని.. మైనంపల్లి మళ్లీ గెలిచేది లేదని మల్లారెడ్డి జోస్యం చెప్పారు. 

కాంగ్రెస్ అంటే స్కాం.. కేసీఆర్ అంటే అభివృద్ధి అన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ మాయమాటలు చెబుతుందని, వారి పాలనలో కరెంట్ కోతలతో పరిశ్రమలు మూతబడ్డాయని దుయ్యబట్టారు. ఐటీ రంగంల కూడా ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందిందని .. కాంగ్రెస్ ఎప్పుడూ మాయమాటలు చెబుతుందని మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో కులవృత్తులవారు ముురిసిపోతున్నారని.. అంతకుముందు వానలు పడాలని .. ఇప్పుడు వానలు చాలని వరుణ దేవుడికి మొక్కానని మల్లారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి అన్నీ కుంభకోణాలేనని .. దేశాన్ని వారు దరిద్రం చేసి వెళ్లారని పేర్కొన్నారు. ముస్లింలు, దళితులను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుందని మంత్రి ఎద్దేవా చేశారు. 

Latest Videos

click me!