Heat Waves: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. వడగాల్పుల తీవ్రత సైతం క్రమంగా పెరుగుతోంది. దీంతో వడదెబ్బకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే రికార్డు స్థాయి ఎండలు, తీవ్ర వడగాల్పుల కారణంగా తెలంగాణలో మరో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వాతావరణ నిపుణులు, వైద్యులు ఎండల నుంచి కాపాడుకోవడానికి రక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Telangana-Sunstroke: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. వడగాల్పుల తీవ్రత సైతం క్రమంగా పెరుగుతోంది. దీంతో వడదెబ్బకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే రికార్డు స్థాయి ఎండలు, తీవ్ర వడగాల్పుల కారణంగా తెలంగాణలో మరో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వాతావరణ నిపుణులు, వైద్యులు ఎండల నుంచి కాపాడుకోవడానికి రక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
వివరాల్లోకెళ్తే.. తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. పలు జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో వడదెబ్బతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం గట్టిగల్లుకు చెందిన పదేళ్ల బాలుడు గురువారం రాత్రి మృతి చెందాడు. గురువారం హైదరాబాద్ వచ్చిన బాలుడు నగరమంతా తిరిగాడు. ఆ తర్వాత ఎండ వేడిమికి వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యాడు. గురువారం రాత్రి మృతి చెందాడు. అలాగే, జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన 11 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఆమె వడదెబ్బకు గురై కుప్పకూలిపోయింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.
ఇదిలావుండగా, అమీన్ పూర్ లోని హెచ్ ఎంటీ స్వర్ణపురి కాలనీలోని సమీపంలోని జలాశయంలో మునిగి వలస కూలీల ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పెరగడం, వడగాల్పుల తీవ్రత కారణంగా ఎనిమిదేళ్ల బాధితుడు తన తొమ్మిదేళ్ల బంధువుతో కలిసి గురువారం మధ్యాహ్నం ఈత కొట్టేందుకు జలాశయం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలోనే వారు ఇద్దరు ఆ జలాశయంలోని లోతైన గుంతలో పడి మునిగిపోయినట్లు సమాచారం. బాలురు నీటమునిగడాన్ని గమనించిన చుట్టుపక్కల స్థానికులు సహాయం కోసం పరుగులు తీశారు. వారిని బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఇద్దరు బాలుర కుటుంబాలు బీహార్ నుంచి భవన నిర్మాణ కార్మికులుగా పనిచేసేందుకు వచ్చాయి. మరోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో రైతులు తమ పశువులను జాగ్రత్తగా చూసుకోవాలని జగిత్యాల జిల్లా అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. రోజంతా జంతువులకు ఆశ్రయం కల్పించాలనీ, వాటికి సరైన నీరు, ఆహారం అందించాలని, లేనిపక్షంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గుండె సమస్యలతో పాటు అనేక సమస్యలు వస్తాయని హెచ్చరించారు.