రూ.2 లక్షలిస్తారా , పేల్చేయమంటారా.. మానవ బాంబు గెటప్‌లో బ్యాంక్‌లోకి : షాపూర్‌ నగర్‌లో కలకలకం

Siva Kodati |  
Published : May 19, 2023, 06:31 PM IST
రూ.2 లక్షలిస్తారా , పేల్చేయమంటారా.. మానవ బాంబు గెటప్‌లో బ్యాంక్‌లోకి  : షాపూర్‌ నగర్‌లో కలకలకం

సారాంశం

హైదరాబాద్ షాపూర్ నగర్‌లోని ఆదర్శ బ్యాంక్ వద్ద ఓ వ్యక్తి సూసైడ్ బాంబర్ గెటప్‌లో హల్ చల్ చేశాడు .  తనకు రూ.2 లక్షలు ఇవ్వాలని లేకుంటే బ్యాంక్‌ను పేల్చేస్తానని బెదిరించాడు. 

హైదరాబాద్ షాపూర్ నగర్‌లోని ఆదర్శ బ్యాంక్ వద్ద శుక్రవారం ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. తాను మానవ బాంబునంటూ శివాజీ అనే వ్యక్తి బ్యాంక్‌లోకి దూరాడు. బాడీ మొత్తానికి ఆత్మహుతి బాంబర్‌లో సెటప్ చేసుకుని లోపలకి ప్రవేశించాడు. తనకు రూ.2 లక్షలు ఇవ్వాలని లేకుంటే బ్యాంక్‌ను పేల్చేస్తానని బెదిరించాడు. అతని బాడీకి వున్న బాంబు సెటప్‌ను చూసి సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. ఆపై వెంటనే పోలీసులకు సమాచారం చేయడంతో బ్యాంక్ వద్దకు చేరుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు