ఆర్టీసీ బస్సు ఫుట్ బోర్డుపై జర్నీ: పట్టుతప్పి కిందపడ్డ మహిళ, ఏమైందంటే?

Published : Feb 21, 2024, 10:27 AM ISTUpdated : Feb 21, 2024, 10:37 AM IST
 ఆర్టీసీ బస్సు ఫుట్ బోర్డుపై జర్నీ: పట్టుతప్పి కిందపడ్డ మహిళ, ఏమైందంటే?

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో మహిళ ప్రయాణీకుల సంఖ్య పెరిగింది.  దీంతో ఫుట్ బోర్డు ప్రయాణాలు కూడ చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.


హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో  ఉచిత ప్రయాణం  కారణంగా  మహిళా ప్రయాణీకుల సంఖ్య  విపరీతంగా పెరిగింది.  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.  ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు  కాంగ్రెస్ ప్రభుత్వం  ఆర్టీసీ బస్సుల్లో  మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించింది. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత  రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళ ప్రయాణీకుల సంఖ్య పెరిగింది.  బస్సుల ఆక్యుపెన్సీ రేటు కూడ పెరిగిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

also read:రాజ్యసభకు సోనియా: రాజస్థాన్ నుండి ఏకగ్రీవ ఎన్నిక

ఆర్టీసీ బస్సుల్లో   మహిళ ప్రయాణీకుల  రద్దీ పెరిగింది. దరిమిలా మహిళలు కూడ  ఫుట్ బోర్డు  చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగిన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల సంఖ్యను కూడ పెంచింది. మరో వైపు  ఆర్టీసీ బస్సుల్లో సీట్ల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకుంది.  ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో స్త్రీలు, పురుషుల మధ్య ఉన్న అడ్డుగా ఉన్న బారికేడును తొలగించారు. మరో వైపు మెట్రో రైళ్లలో మాదిరిగా  సీట్లను మార్చారు. రానున్న రోజుల్లో  మరికొన్ని కొత్త బస్సులను కూడ  అందుబాటులోకి తీసుకువస్తామని  ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

also read:చేతిలో చిల్లిగవ్వ లేదు, టీ కోసం డబ్బు సంపాదించారు: నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో

సికింద్రాబాద్ లోతుకుంట వద్ద ఆర్టీసీ బస్సులో ఫుట్ బోర్డు చేస్తూ ఓ మహిళ కిందపడిపోయింది.  అయితే  ఈ విషయాన్ని గుర్తించిన బస్సు డ్రైవర్  సడెన్ గా బ్రేక్ కొట్టాడు. లేకపోతే ప్రమాదం జరిగేది.  ఈ ప్రమాదంలో మహిళకు స్వల్పగాయాలయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో  చక్కర్లు కొడుతుంది.  ఫుట్ బోర్డుపై నిలబడి ప్రయాణం చేయవద్దని కూడ  అధికారులు సూచిస్తున్నారు. ఆలస్యమైనా మరో బస్సు కోసం వేచి ఉండాలని సూచిస్తున్నారు. అయితే విధులను ముగించుకొని త్వరగా ఇళ్లకు వెళ్లాలనే మహిళలు కొందరు అనివార్యంగా ఫుట్ బోర్డు ప్రయాణాలు చేయాల్సి వస్తుందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

గతంలో పురుషులు ఎక్కువగా ఫుట్ బోర్డు ప్రయాణం చేసేవారు. అయితే  మహిళ ప్రయాణీకుల సంఖ్య పెరగడంతో  మహిళలు కూడ  ఫుట్ బోర్డు ప్రయాణం చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu