ఒకరు కారు షోరూమ్‌లో.. మరొకరు వాచ్‌‌మెన్‌గా..: హైద‌రాబాద్‌లో ఇద్దరు మావోయిస్టులు అరెస్ట్..

Published : Feb 21, 2023, 11:05 AM IST
ఒకరు కారు షోరూమ్‌లో.. మరొకరు వాచ్‌‌మెన్‌గా..: హైద‌రాబాద్‌లో ఇద్దరు మావోయిస్టులు అరెస్ట్..

సారాంశం

హైదరాబాద్‌లో ఇద్దరు మావోయిస్టులను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. 2006 నుంచి పరారీలో ఉన్న ఈ ఇద్దరు మావోయిస్టులు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నట్టుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 

హైదరాబాద్‌లో ఇద్దరు మావోయిస్టులను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. 2006 నుంచి పరారీలో ఉన్న ఈ ఇద్దరు మావోయిస్టులు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నట్టుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన ఈ ఇద్దరు మావోయిస్టులు భార్యభర్తలుగా తెలుస్తోంది. వీరిద్దరిపై రూ. 10 లక్షల రివార్డు కూడా ఉందని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు.. నిందితుల్లో ఒకరైన తుగే అలియాస్ మధుకర్ చినన్న కొడపే (42)2002లో చట్టవిరుద్ధమైన సంస్థ అహేరీ స్థానిక సంస్థ స్క్వాడ్‌లో (ఎల్‌ఓఎస్) సభ్యుడిగా రిక్రూట్ అయ్యాడు. జిమల్‌గట్ట, సిరొంచలలో వివిధ బృందాల్లో పనిచేసి 2006 నుంచి పరారీలో ఉన్నాడు. అతడు తొమ్మది హత్య కేసులు, ఎనిమిది ఎన్‌కౌంటర్‌లు, రెండు దోపిడీలు, నాలుగు దహన సంఘటనలు, హత్యాయత్నం కేసుల్లో నిందితుడు. అతని తలపై రూ. 8 లక్షల రివార్డు ఉంది. తెలంగాణలోని హైదరాబాద్‌లోని ఓ సెక్యూరిటీ సంస్థలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న మధుకర్‌ను సోమవారం గడ్చిరోలి పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌కు చెందిన అహేరి ఎల్‌ఓఎస్‌లో సభ్యురాలుగా ఉన్న మహిళా నక్సలైట్ శ్యామల అలియాస్ జమానీ మంగళు పూనం (35)ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె హైదరాబాద్‌లోని ఓ కార్ షోరూమ్‌లోని హౌస్‌కీపింగ్ విభాగంలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఒక హత్య కేసు, ఐదు ఎన్‌కౌంటర్‌లు, దోపిడీ, దహనానికి సంబంధించిన ఒక్కొక్క కేసులో నిందితురాలుగా ఉన్నారని.. ఆమె తలపై రూ. 2 లక్షల రివార్డు ఉందని పోలీసులు చెప్పారు. 

నిందితులు ఇద్దరు భార్యాభర్తలు కావచ్చని..  అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వారు 2006 నుంచి తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ల మధ్య తిరుగుతున్నారని పోలీసులు తెలిపారు. అయితే వీరి ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు..  దాదాపు ఏడాది పాటు ట్రాక్ చేసిన తర్వాత సోమవారం అరెస్టు చేసినట్లుగా చెప్పారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?
Air Pollution : హైదరాబాద్ మరో డిల్లీ అవుతోందా..! ఈ ప్రాంతాల్లో మరీ ఇంత కాలుష్యమా..!!