హైద్రాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకి మద్దతివ్వాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్: హైద్రాబాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు మద్దతివ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది మార్చి 13వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. హైద్రాబా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంతో పాటు హైద్రాబాద్-రంగారెడ్డి- మహబూబ్ నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
హైద్రాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుండి ఎంఐఎంకు చెందిన సయ్యద్ హసన్ జాఫ్రీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జాఫ్రీ ఈ ఏడాది మే 1వ తేదీన రిటైర్ కానున్నారు. దీంతో ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం, బీఆర్ఎస్ మిత్రపక్షాలుగా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో హైద్రాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో ఎంఐఎం అభ్యర్ధి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.ద దీంతో ఈ స్థానంలో ఎంఐఎంకు మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది.
undefined
2017 లో జరిగిన హైద్రాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి, హైద్రాబాద్ -రంగారెడ్డి -మహబూబ్ నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల జరిగాయి.ఈ సమయంలో హైద్రాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో ఎంఐఎంకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. హైద్రాబాద్ -రంగారెడ్డి -మహబూబ్ నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్‌టీయూ- టీఎస్ అభ్యర్థికి మద్దతిచ్చింది గులాబీ పార్టీ.
హైద్రాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని బీజేపీ తొలుత భావించింది. ఎంఐఎంకు బీఆర్ఎస్ మద్దతివ్వాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పోటీ చేయాలని బీజేపీ భావిస్తుంది. ఈ విషయమై బీజేపీ నాయకత్వం ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు.
also read:రాజ్యాంగంతో కాదు బుల్డోజర్‌తో పాలన సాగిస్తోంది: బీజేపీపై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్
ఈ స్థానంలో పోటీకి ఇతర పార్టీలు కూడా ఆసక్తిగా లేవు. నామినేషన్ల దాఖలుకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. హైద్రాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవిని కైవసం చేసుకునేందుకు ఏ ఒక్కపార్టీకి కూడా పూర్తిస్థాయి బలం లేదు. ఇతర పార్టీల మద్దతుతో విజయంసాధించాల్సిన పరిస్థితులే ఉన్నాయి.
హైద్రాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఓట్లు 127.అయితే ఇందులో 9 స్థానాలు ఖాళీ గా ఉన్నాయి. దీంతో 118 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకుంటారు. . ఈ స్థానంలో విజయం సాధించాలంటే 60 ఓట్లు దక్కించుకోవాలి.