హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, 8 మందికి గాయాలు..

Published : Feb 05, 2023, 03:38 PM IST
హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, 8 మందికి గాయాలు..

సారాంశం

హైదరాబాద్ ‌ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం  జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.

హైదరాబాద్ ‌ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం  జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఘట్‌కేసర్‌ నుంచి వస్తున్న మెర్సిడెస్‌ బెంజ్ కారు అదుపు తప్పి డివైడర్ ఢీ కొట్టి ఎదురుగా మీర్‌పేట్ నుంచి వస్తున్న మరో కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక, ఘట్‌కేసర్ నుంచి వస్తున్న మెర్సిడెస్‌ బెంజ్‌ కారు డ్రైవర్‌ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది