కేసీఆర్ సమక్షంలో పలువురు మరాఠా నేతలు ఇవాళ బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ రాష్ట్రం వెలుపల నాందేడ్ లో జరిగిన సభే తొలి సభ.
ముంబై : బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సమక్షంలో పలువురు నేతలు ఆదివారం నాడు బీఆర్ఎస్ లో చేరారు. మహరాష్ట్రలోని నాందేడ్ బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో పలువురు మరాఠా నేతలను కేసీఆర్ బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలో కి ఆహ్వానించారు.
ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్ హైద్రాబాద్ నుండి మహరాష్ట్ర నాందేడ్ కు బయలుదేరారు. ప్రత్యేక విమానంలో హైద్రాబాద్ నుండి కేసీఆర్ నాందేడ్ కు చేరుకున్నారు. నాందేడ్ ఎయిర్ పోర్టు నుండి బహిరంగ సభ జరిగే ప్రదేశానికి ప్రత్యేక కాన్వాయ్ లో చేరుకున్నారు. సభా వేదికకు సమీపంలో చత్రపతి శివాజీ విగ్రహనికి కేసీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గురుద్వారాను సందర్శించి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అక్కడి నుండి కేసీఆర్ సభావేదికకు చేరుకున్నారు. కేసీఆర్ సమక్షంలో బీజేపీ, బీఎస్పీ, ఎన్సీపీ, శివసేన పార్టీలకు రాజీనామాలు సమర్పించి పలువురు బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ ఏర్పాటైన తర్వాత తెలంగాణలో కాకుండా మహరాష్ట్రలో నిర్వహించే సభే తొలి సభ. దేశంలోని పలు రాష్ట్రాల్లో నిర్వహించనుంది.