నిజామాబాద్‌లో వేట: జింక మాంసంతో హైద్రాబాద్‌కి, ఇద్దరు వేటగాళ్లు అరెస్ట్

Published : Mar 09, 2021, 03:04 PM IST
నిజామాబాద్‌లో వేట: జింక మాంసంతో హైద్రాబాద్‌కి, ఇద్దరు వేటగాళ్లు అరెస్ట్

సారాంశం

హైద్రాబాద్‌ నగరంలో ఇద్దరు వేటగాళ్లను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో జింకలను వేటాడినట్టుగా పోలీసులు గుర్తించారు.


హైదరాబాద్: హైద్రాబాద్‌ నగరంలో ఇద్దరు వేటగాళ్లను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో జింకలను వేటాడినట్టుగా పోలీసులు గుర్తించారు.

నిజామాబాద్ లో ఓ జింకను చంపిన మాంసాన్ని హైద్రాబాద్ కు తీసుకువస్తున్నారు. జింక మాంసంతో పాటు మరో జింకను కూడ నిందితులు తరలిస్తున్నారు. కచ్చితమైన సమాచారంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

గతంలో కూడ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జింకలను వేటాడి మాంసాన్ని విక్రయిస్తున్న కేసులు నమోదయ్యాయి. అటవీ ప్రాంతాలు ఉన్న జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకొన్నాయి. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడిన కేసు పెద్ద ఎత్తున సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఓ పోలీసు అధికారి కూడ సస్పెండ్ అయిన విషయం తెలిసిందే.

గత ఏడాది డిసెంబర్ మాసంలో కూడ నిజామాబాద్ జిల్లాలో  వన్యప్రాణులను వేటాడిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే