టీఆర్ఎస్‌పై ప్రజల్లో అసంతృప్తి: కోదండరామ్

Published : Mar 09, 2021, 02:28 PM IST
టీఆర్ఎస్‌పై ప్రజల్లో అసంతృప్తి: కోదండరామ్

సారాంశం

టీఆర్ఎస్‌ సర్కార్ పై రాష్ట్రంలోని అన్ని వర్గాల్లో అసంతృప్తి ఉందని  తెలంగాణ జనసమితి చీఫ్ కోదండరామ్ చెప్పారు.


హైదరాబాద్: టీఆర్ఎస్‌ సర్కార్ పై రాష్ట్రంలోని అన్ని వర్గాల్లో అసంతృప్తి ఉందని  తెలంగాణ జనసమితి చీఫ్ కోదండరామ్ చెప్పారు.

మంగళవారం నాడు నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిరంకుశ, అసమర్ధ పాలనకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు తీర్పును ఇస్తారని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ట్యాంక్ బండ్‌పై మిలియన్ మార్చ్ జరిగి రేపటితో పదేళ్లు పూర్తవుతోందన్నారు. ఈ సందర్భంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా అమరవీరులకు నివాళులు అర్పిస్తామన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ  ఎన్నికల్లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానం నుండి కోదండరామ్ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుండి విజయం కోసం కోదండరామ్ విస్తృతంగా పర్యటిస్తున్నారు.

రాష్ట్రంలోని రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ రెండు స్థానాలకు 50 మందికిపైగా పోటీ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?
Venkaiah Naidu Speech: వెంకయ్య నాయుడు పంచ్ లకి పడిపడి నవ్విన బ్రహ్మానందం| Asianet News Telugu