మద్యం మత్తులో బైక్ పై చక్కర్లు.. ప్రమాదానికి గురై..!

By telugu news teamFirst Published Nov 30, 2021, 9:40 AM IST
Highlights

ఆ బైక్ పై తాను సరదాగా తిరుగుతూ.. తన స్నేహితుడిని కూడా రావాలని కోరాడు. కొత్త బైక్ పై షికార్లు కొట్టొచ్చని.. అతను కూడా వెళ్లాడు. ఇద్దరూ.. బైక్ పై సరదాగా తిరుగతూ.. మద్యం తాగి.. రచ్చ చేశారు


మద్యం మత్తు.. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. బైక్ కావాలని కొడుకు ప్రతిరోజూ మారం చేస్తున్నాడని.. అతనిని బాధ పెట్టడం ఇష్టంలేక.. బైక్ కొనిపెట్టారు. ఆ బైక్ పై తాను సరదాగా తిరుగుతూ.. తన స్నేహితుడిని కూడా రావాలని కోరాడు. కొత్త బైక్ పై షికార్లు కొట్టొచ్చని.. అతను కూడా వెళ్లాడు. ఇద్దరూ.. బైక్ పై సరదాగా తిరుగతూ.. మద్యం తాగి.. రచ్చ చేశారు. చివరకు.. రోడ్డు ప్రమాదానికి గురై.. ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన జీడిమెట్లలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సూరారం విశ్వకర్మ కాలనీకి చెందిన అబ్బాస్(20) హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్నాడు. ద్విచక్ర వాహనం కావాలని కొన్ని నెలలుగా తల్లిదండ్రులను కోరుతున్నాడు. అయితే.. వారు తర్వాత కొని పెడతామని చెబుతూ వచ్చేవారు. అయితే.. బైక్ కొనకపోతే.. అన్నం తిననూ అంటూ అలిగి కూర్చున్నాడు. దీంతో.. ఇటీవల బైక్ కొనిపెట్టారు.

Also Read: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సజ్జనార్ కుటుంబం.. వీడియో వైరల్...

ఆ బైక్ పై తాను వెళుతూ.. తన స్నేహితుడు బహదూర్ పల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన సాయి కిరణ్(25) ని కూడా తీసుకువెళ్లాడు. సాయి కిరణ్.. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 11నెలల క్రితమే వి వాహమైంది. అబ్బాస్ పిలిచాడని.. సాయి కిరణ్ కూడా వెళ్లాడు. ఇద్దరూ ఈ నెల 24వ తేదీ రాత్రి మద్యం సేవించారు. అనంతరం రాత్రి 1.45 గంటల సమయంలో.. బైక్ పై వేగంగా బాలానగర్ వైపు వెళ్లారు. చింతల్ బస్టాప్ సమీపంలోని ఆర్ఎన్ సీ ఆస్పత్రి వద్ద ఓ కారును ఓవర్ టేక్ చేయాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో.. అదుపుతప్పి.. డివైడర్ ని ఢీ కొట్టారు.

Also Read: Bigg Boss Telugu 5 : రవి ఎలిమినేషన్ పై మండిపడ్డ రాజాసింగ్.. షో బ్యాన్ చేయాలంటూ డిమాండ్...

ఈ క్రమంలో ఇద్దరూ ఎగిరి రోడ్డుపై పడ్డారు. అబ్బాస్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. సాయి కిరణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన సమయంలో.. ఇద్దరూ మద్యం సేవించి ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. హెల్మెట్ లేకుండా 100 కిలో మీటర్ల వేగంతో దూసుకువెళ్లడంతోనే కంట్రోల్ తప్పి.. ప్రమాదానికి గురయ్యారని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. చేతికి అంది వచ్చిన కొడుకులు ప్రాణాలు కోల్పోవడంతో.. వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించడం గమనార్హం. 

click me!