దుండిగల్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు..

Published : Feb 04, 2023, 10:08 AM IST
దుండిగల్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు..

సారాంశం

హైదరాబాద్ నగర శివార్లలోని దుండిగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ డీసీఎం దుండిగల్‌ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది.

హైదరాబాద్ నగర శివార్లలోని దుండిగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ డీసీఎం దుండిగల్‌ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 11 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించారు. బాధితులు గౌడవెల్లి నుంచి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ గార్డెన్‌కు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన డీసీఎంలో మొత్తం 16 మంది ప్రయాణిస్తునట్లు తెలుస్తోంది. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం