హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. రామంతపూర్‌లో ఫర్నీచర్ గోడౌన్‌లో చెలరేగిన మంటలు..

Published : Feb 04, 2023, 09:32 AM IST
హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. రామంతపూర్‌లో ఫర్నీచర్ గోడౌన్‌లో చెలరేగిన మంటలు..

సారాంశం

హైదరాబాద్‌లో చోటుచేసుకుంటున్న వరుస అగ్ని ప్రమాదాలను జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా శనివారం ఉదయం మరో అగ్ని ప్రమాదం జరిగింది.

హైదరాబాద్‌లో చోటుచేసుకుంటున్న వరుస అగ్ని ప్రమాదాలను జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా శనివారం ఉదయం మరో అగ్ని ప్రమాదం జరిగింది. రామంతపూర్‌లోని ఓ ఫర్నీచర్‌ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు  చెలరేగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. అయితే భారీగా మంటలు చెలరేగడంతో.. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. 

ఇక, గతకొంతకాలంగా హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు  చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గత నెలలో సికింద్రాబాద్‌ రాంగోపాల్‌పేట్‌లో దక్కన్‌ మాల్‌ భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల చిక్కడపల్లి వీఎస్‌టీ సమీపంలోనీ ఓ గోదాంలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇక, శుక్రవారం తెల్లవారుజామున తెలంగాణ నూతన సెక్రటేరియట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ ప్రమాదం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారవర్గాలు తెలిపాయి. అగ్ని ప్రమాదానికి కారణాలు ఏమిటనేది స్పష్టంగా తెలియరాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది.. 11 అగ్నిమాపక వాహనాలను సంఘటనా స్థలానికి తరలించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే