
Electric shock: హైదరాబాద్‌లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. రామంతాపూర్ విషాద ఘటన మరువకముందుకే నగరంలో మరో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్‌తో తాజాగా మరో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆస్ప్రతిలో చిక్సిత పొందుతున్నారు. వినాయక విగ్రహాన్ని తరలిస్తున్న క్రమంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
వివరాల ప్రకారం.. బండ్లగూడ ప్రాంతంలో కొందరు యువకులు వినాయక విగ్రహాన్ని ట్రాక్టర్ పై తరలిస్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్ పై ఉన్న విగ్రహానికి హై టెన్షన్ విద్యుత్ వైర్లను తాకిలాయి. ఒక్కసారిగా వారంతా కరెంట్ షాక్ కు గురయ్యారు. ఈ ప్రమాదంలో టోనీ (21), వికాస్ (20) అక్కడికక్కడే మరణించారు. అఖిల్ అనే మరొక యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్ టైర్లు కూడా పూర్తిగా కాలిపోయాయి. పోలీసులు, క్రేన్ సహాయంతో విగ్రహాన్ని తొలగించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మరోవైపు... ఆదివారం రాత్రి రామంతాపూర్‌లోని శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో అప్రశ్రుతి చోటు చేసుకుంది. ఆ వేడుకలో రథం విద్యుత్ తీగను తాకి ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం తొమ్మిది మంది ఈ ఘటనలో ప్రభావితులయ్యారు. స్థానికులు తీసిన సీపీఆర్ సహాయాలు ఫలితం ఇవ్వకపోవడంతో మరణాలు సంభవించాయి. హైదరాబాద్ పోలీస్ అధికారులు, ప్రభుత్వ అధికారులు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధక చర్యలు తీసుకోవడానికి చర్యలు చేపట్టాలని ప్రకటించారు. రామంతాపూర్ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.