హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలో విషాదం.. నిర్మాణంలో ఉన్న భవనం‌లో ప్రమాదం.. ఇద్దరు కూలీలు మృతి..

By Sumanth Kanukula  |  First Published Sep 7, 2023, 10:14 AM IST

హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలోని అడ్డగుట్ట కాలనీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతిచెందారు.


హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలోని అడ్డగుట్ట కాలనీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతిచెందారు. వివరాలు.. అడ్డగుట్టలో మెయిన్ రోడ్డు పక్కనే భవన నిర్మాణం జరుగుతుంది. గురువారం ఉదయం కార్మికులు పనులు చేస్తున్న సమయంలో సెంట్రింగ్ కర్రలు విరిగిపడ్డాయి.  దీంతో నిర్మాణ పనుల్లో ఉన్న కూలీలు ఆరో అంతస్తు నుంచి కిందపడ్డారు. అంతేకాకుండా గోడ కూలి ఇటుకలు చెల్లాచెదురుగా రోడ్డు మీద పడ్డాయి.

ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు ఘటన స్థలంలోనే మృతిచెందారు. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురు కూలీల పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఇక, ఈ ఘటనలో మృతిచెందిన కూలీలు బీహార్‌కు చెందినవారిగా తెలుస్తోంది. 

Latest Videos

click me!