బాత్రూం చెత్తబుట్టలో బంగారమే బంగారం... శంషాబాద్ ఎయిర్ పోర్టులో...

By Arun Kumar P  |  First Published Sep 7, 2023, 9:42 AM IST

శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ తనిఖీల నుండి తప్పించుకునేందుకు బంగారం స్మగ్లర్లు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు.  


హైదరాబాద్ : విదేశాల నుండి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న స్మగ్లర్లు అతితెలివి ప్రదర్శిస్తున్నారు. విమానాశ్రయంలో బంగారం పట్టుబడకుండా కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే స్మగ్లర్ల ఎత్తులను చిత్తుచేస్తూ కస్టమ్స్ అధికారులు కేజీల కొద్ది బంగారాన్ని పట్టుకుంటున్నారు. ఇలా తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో బాత్రూం చెత్తబుట్టిలో భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. 

వివరాల్లోకి వెళితే... దుబాయ్ నుండి హైదరాబాద్ కు అక్రమంగా బంగారాన్ని తీసుకువస్తున్న ఓ స్మగ్లర్ శంషాబాద్ విమానాశ్రయంలో దిగాడు. కస్టమ్స్ అధికారుల తనిఖీ వెళ్లేముందు బాత్రూంలోకి వెళ్ళిన అతడు తన వద్దగల బంగారాన్ని చెత్తబుట్టిలో పడేసాడు. తర్వాత బాత్రూంలోంచి బయటకు వచ్చి కస్టమ్స్ తనిఖీలకు వెళ్ళాడు. కానీ అతడి తీరు అనుమాస్పదంగా వుండటంతో కస్టమ్స్ అధకారులు తమదైన స్టైల్లో విచారించగా అసలు నిజాన్ని బయటపెట్టాడు. 

Latest Videos

దుబాయ్ నుండి తీసుకువచ్చిన బంగారాన్ని బాత్రూం చెత్తబుట్టిలో వేసానని... దీన్ని ఎయిర్ పోర్ట్ లోనే పనిచేసే ఓ ఉద్యోగి బయటకు తీసుకువెళతాడని తెలిపాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు చెత్తబుట్టిని బయటకు తీసుకువెళుతున్న ఉద్యోగిని పట్టుకున్నారు. చెత్తబుట్టిలోని 933 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  

Read More  రాయదుర్గం డ్రగ్స్ కేసు.. ఎస్సై రాజేందర్ సస్పెన్షన్

ఇక ఇదేరోజు(మంగళవారం) ఉదయం కూడా ఇలాగే బాత్రూం చెత్తబుట్టిలో బంగారాన్ని గుర్తించారు కస్టమ్స్ అధికారులు. కువైట్ నుండి వచ్చిన విమానంలో ఓ ప్రయాణికుడు అక్రమంగా బంగారాన్ని తీసుకువచ్చాడు. కస్టమ్స్ తనిఖీలకంటే ముందే బాత్రూం చెత్తబుట్టిలో 1300 గ్రాముల బంగారాన్ని దాచాడు. దీన్ని విమానాశ్రయ ఉద్యోగుల సాయంతో బయటకు తరలించే ఏర్పాట్లు చేసుకున్నాడు. 

అయితే కస్టమ్స్ అధికారులు అతడి ప్లాన్ ను పసిగట్టారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని చెత్తబుట్టిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే రాత్రి మరో ప్రయాణికుడు ఇలాగే చేయగా పోలీసులు పట్టుకున్నారు. 

 

click me!